• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జనసేనాని పవన్ కు షాక్ ... ఈసారి జిల్లా కోఆర్డినేటర్ జంప్

|

ఏపీ ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపిస్తుంది అని అందరూ భావించిన పార్టీ ఎలాంటి ప్రభావం చూపించాకపోవతంతో ఇప్పుడు దాని ప్రభావం పార్టీపై పడుతుంది. జనసేన పార్టీ నుండి ఒక్కొక్కరు పార్టీ వీడి వెళ్తున్నారు. అందరి అంచనాలు తారుమారు చేస్తూ జనసేన ఏపీలో శాసనసభ ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితం కావటం ఏకంగా పవన్ ఓటమి చెందటం జీర్ణించుకోలేకపోతున్న అభిమానులకు ఇప్పుడు తాజాగా జనసైన్యం పార్టీ వీడి వెళ్ళిపోవటం డైజెస్ట్ కావటం లేదు .

పవన్ కు కాపు కాయని కాపులు..! కాపులను సరిగ్గా టార్గెట్ చేయలేకపోయిన గబ్బర్ సింగ్..!!

పార్టీకి షాక్ ఇచ్చి జంప్ అవుతున్న జనసేన నేతలు

పార్టీకి షాక్ ఇచ్చి జంప్ అవుతున్న జనసేన నేతలు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పులు తీసుకు రావడం ఖాయం అని అంతా భావించారు కానీ అది సాధ్య పడలేదు. మార్పు కోరుకున్న పవన్ పార్టీ ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. దీంతో పార్టీలో పని చేసిన కీలక నాయకులు పార్టీ మారుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్ కోసం అధికార పార్టీ అయిన వైసీపీ పంచన చేరుతున్న్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. తాను పోటీచేసిన రెండు చోట్ల ఘోరంగా ఓటమి పాలవ్వడంతో ఆ బాధ నుంచి ఇంకా తేరుకోని పవన్ కళ్యాణ్ కు ఆ పార్టీ నేతలు గట్టి షాక్ ఇస్తున్నారు. ఇది పవన్ కు సైతం ఇబ్బందికరంగా మారింది.

పశ్చిమగోదావరి జిల్లా నాయకుడు, భీమవరం జనసేన కో ఆర్డినేటర్ వైసీపీ లోకి జంప్

పశ్చిమగోదావరి జిల్లా నాయకుడు, భీమవరం జనసేన కో ఆర్డినేటర్ వైసీపీ లోకి జంప్

పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ కో ఆర్డినేటర్ ఎర్రంకి సూర్యారావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్,నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుల సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జనసేన పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కో ఆర్డినేటర్ గా ఎర్రంకి సూర్యారావును నియమించారు పవన్ కళ్యాణ్. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీకి అన్నీ తానై నడిపించారు. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపుకోసం శ్రమించారు. కానీ గెలిపించలేకపోయారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఊహించని రీతిలో పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. దీంతో అక్కడ గెలిచినా గ్రంధి శ్రీనివాస్ పంచన చేరారు సూర్యా రావు . పవన్ ఓటమితో పవన్ పార్టీలో ఉంటె రాజకీయంగా ఎదుగుదల ఉండదని భావించి జగన్ కు జై కొట్టారు.

పార్టీని పటిష్టం చెయ్యాలని భావిస్తున్న పవన్ కు షాక్ .. జంప్ అవుతున్న నాయకులను ఆపేదెలా ?

పార్టీని పటిష్టం చెయ్యాలని భావిస్తున్న పవన్ కు షాక్ .. జంప్ అవుతున్న నాయకులను ఆపేదెలా ?

ఒకపక్క పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చెయ్యాలని, పునర్నిర్మించాలని భావిస్తున్నారు. పార్టీని బూత్ స్థాయి కమిటీలు వేసి, గ్రామ కమిటీలు వేసి పటిష్టం చెయ్యాలని నిర్ణయించారు . అలాగే జిల్లా స్థాయి సమీక్షలు జరిపి మరింత బలంగా ముందుకు వెళ్ళాలని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ . కానీ అనూహ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ నుండి ముఖ్య నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పటం పవన్ కు , అలాగే జనసైనికులకు షాక్ అనే చెప్పాలి. ఇప్పటికైనా పవన్ పార్టీ నాయకులను , శ్రేణులను కాపాడుకునే యత్నం చెయ్యాలి .

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Even before the fans and followers of Janasena Party are yet to come to terms with the poll drubbing of the party and the defeat of Pawan Kalyan himself in both Bhimavaram and Gajuwaka constituencies in general elections 2019, here is yet another major shocker to Pawan and his party.Janasena party's West Godavari district leader and Bhimavaram coordinator Erranki Surya Rao has jumped into YSRCP giving a shock to Jansena leaders. Surya Rao, who had played significant role in Bhimavaram from where Pawan himself contested, has joined YCP in the presence of Bhimavaram MLA Grandhi Srinivas (YCP) and Narsapuram MP Raghurama Krishnam Raju (YCP).Pawan's die-hard fans and Janasena party workers are unable to digest Surya Rao jumping into Jagan's fold.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more