విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ్యభిచారంలో పోటీనే హత్యకు కారణం ? ఆమె అందమే శాపం .. దివ్య హత్యకేసులో షాకింగ్ ట్విస్ట్ లు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దివ్య హత్యకేసును విశాఖ పోలీసులు త్వరితగతిన ఛేదించారు. అత్యంత పాశవికంగా దివ్యను దారుణంగా హతమార్చి గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని తరలించాలని ప్రయత్నం చేసిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇక ఈ దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. దివ్య హత్యకేసులో నలుగురికిపైగా వ్యక్తులు పాల్గొన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.

విశాఖ గ్యాస్ లీక్ ఘటన హైపవర్ కమిటీ విచారణ ... రెండో రోజు విచారణ సాగుతుందిలా!!విశాఖ గ్యాస్ లీక్ ఘటన హైపవర్ కమిటీ విచారణ ... రెండో రోజు విచారణ సాగుతుందిలా!!

తల్లిదండ్రులు లేకపోవటంతో వ్యభిచార రొంపిలోకి దిగిన దివ్య

తల్లిదండ్రులు లేకపోవటంతో వ్యభిచార రొంపిలోకి దిగిన దివ్య

ఇక ప్రధాన నిందితురాలు వసంత, ఆమె సోదరి మంజుల ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి సహకరించిన వారిపై కూడా ఆరా తీస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలానికి చెందిన దివ్యకు తల్లిదండ్రులు చనిపోవడంతో పిన్ని క్రాంతివేణి ఇంటికి చేరింది. ఇక డబ్బుకు ఆశపడి క్రాంతివేణి దివ్యను కుమారి అనే ఒక మహిళకు అప్పగించింది. ఆ తర్వాత కుమారి నుండి దివ్యను వసంత అనే మహిళ కొనుగోలు చేసింది. ఇక వ్యభిచార రొంపిలోకి దింపి దివ్య ద్వారా డబ్బులు సంపాదించడంలో బిజీగా మారింది వసంత.

వసంత అనే మహిళ దగ్గర దందా .. బిజినెస్ లో పోటీ , ఎదురు తిరగటంతో దివ్య హత్య

వసంత అనే మహిళ దగ్గర దందా .. బిజినెస్ లో పోటీ , ఎదురు తిరగటంతో దివ్య హత్య

వసంత సోదరి మంజుల కూడా ఇదే వృత్తిలో వసంత ఇంటి దగ్గరలోనే ఉండేది. ఇక ఆమె భర్త చనిపోవడంతో ఆమె సంజయ్ అనే యువకుడు తో సహజీవనం చేస్తోంది. వీరంతా వ్యభిచార వృత్తిలో ఉన్న వారే కావడం, దివ్య వల్ల వీరి బిజినెస్ కు ఇబ్బంది రావడంతో దివ్య పై కోపం పెంచుకున్నారు.దివ్య అందంగా ఉండటం వల్ల ఎక్కువ మంది విటులు మంజుల కంటే దివ్య దగ్గరికి వెళ్ళే వాళ్ళు. ఈ క్రమంలో దివ్య కూడా తనకు ఎక్కువ డబ్బు కావాలని డిమాండ్ చేసేది. దివ్య మీద అసూయ పెంచుకున్న మంజుల, అలాగే తనని ఎదిరిస్తున్న కోపంతో వసంత, ఇక మంజులతో సహజీవనం చేస్తున్న సంజయ్ అందరూ కలిసి పక్కా ప్లాన్ తో దివ్యను చిత్రహింసలు పెట్టి మరీ చంపారు.

వసంత సోదరి మంజుల కంటే అందంగా ఉండటమే దివ్యకు శాపం

వసంత సోదరి మంజుల కంటే అందంగా ఉండటమే దివ్యకు శాపం

హత్యకు గురైన దివ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా ఆమె శరీరంపై 33 గాయాలు ఉన్నట్లుగా గుర్తించారు. వ్యభిచారంలో పోటీనే దివ్య హత్యకు కారణమని తెలుస్తుంది. వ్యభిచార వృత్తిలో వసంత, మంజుల కంటే ఎదుగుతున్న క్రమంలో దివ్య పోటీని తట్టుకోలేక ఆమెను హతమార్చారు.అప్పటికే దివ్య డబ్బుల విషయంలో వసంతతో పలుమార్లు గొడవ పెట్టుకుంది. తనకు ఎక్కువ వాటా కావాలని, తను ఎక్కువ కష్టపడుతున్నా అని డిమాండ్ చేస్తోంది. ఇక లేదంటే తాను బయటకు వెళ్లి పోవాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తుంది.

 కట్టేసి ,గుండు గీసి తిండి పెట్టకుండా చిత్ర హింసలు

కట్టేసి ,గుండు గీసి తిండి పెట్టకుండా చిత్ర హింసలు

ఈ క్రమంలోనే దివ్యని కట్టేసి ఒళ్లంతా వాతలు పెట్టి, కనుబొమ్మలు , జుట్టు గీయించి అండ విహీనంగా తయారు చేసి వారం రోజులపాటు తిండి కూడా పెట్టకుండా నరకం చూపించారు. అనాధ కాబట్టి తన కోసం ఎవరూ వచ్చే అవకాశం లేదు కాబట్టి హతమార్చాలనుకున్నారు.ఇక వారు పెడుతున్న నరకయాతన భరించలేక దివ్య మరణించింది.గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేద్దామని ప్రయత్నం చేసిన వారి బండారం అంతిమయాత్ర వాహన యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బయటపడింది.

Recommended Video

Vizag Gas Leak : NGT Issues Notices To Centre & LG Polymers India
తీగ లాగితే కదిలిన డొంక.. వ్యభిచార దందా గుట్టు రట్టు చేసిన దివ్య హత్య

తీగ లాగితే కదిలిన డొంక.. వ్యభిచార దందా గుట్టు రట్టు చేసిన దివ్య హత్య

ఇక తీగలాగితే డొంక కదిలింది. తూర్పుగోదావరి జిల్లాలో సాగుతున్న వ్యభిచార దందా గుట్టురట్టయింది.వ్యభిచారంలో పోటీనే దివ్య మరణానికి కారణమైంది. ఆమె అందమే ఆమె పాలిట శాపమైంది. ఒక అనాధ జీవితం వ్యభిచార రొంపిలో చిక్కి ఎలా అర్ధాంతరంగా ముగిసిపోయిందో దివ్య కథ చెప్తుంది. అంతకు ముందు దివ్య కుటుంబం సైతం ఇదే తరహాలో హత్యకు గురైంది. ఇక ఇప్పుడు దివ్య జీవితం కూడా ముగిసిపోయింది.

English summary
Visakha police have quickly cracked down on the divya murder case that has created a sensation in the state of Andhra Pradesh. The police have registered a case against those who attempted to evacuate the corpse . they brutally murdered divya. Shocking things are coming out in this investigation. Police believe more than four people were involved in the divya murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X