వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్:ఆంధ్రప్రదేశ్ లో కుటుంబాల కంటే రేషన్ కార్డులే ఎక్కువ...ఇదెలా సాధ్యం?

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఆంధ్రప్రదేశ్ లో కుటుంబాల కంటే రేషన్ కార్డులే ఎక్కువ...!

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక షాకింగ్ నిజం వెలుగుచూసింది. అదేమిటంటే?...ఎపిలో మొత్తం ఉన్న కుటుంబాల కంటే రేషన్ కార్డులే ఎక్కువగా ఉన్నాయట.

తాజాగా ప్రజాసాధికార సర్వేలో ఈ విషయం బైటపడింది. 2016లో ఈ సర్వే ప్రారంభించగా ఇప్పటికీ దాదాపు పూర్తయిందని తెలిసింది. ఈ సర్వే లెక్కల ప్రకారం ఎపిలో ఉన్న కుటుంబాల కంటే సుమారు మూడు లక్షల కార్డులు అదనంగా ఉన్నాయి. అయితే ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే?...ఇప్పుడు కొత్తగా మరో 2.84లక్షల కార్డుల జారీకి పౌరసరఫరాల శాఖ సిద్ధమవడం!..ఇంకో విచిత్రం కూడా ఉంది.అది...ఉన్న కార్డుల్లో నుంచి తమకి విడి కార్డు ఇవ్వాలంటూ మరో 3 లక్షలమంది కోరడం...!

కుటుంబాల కంటే..కార్డులే ఎక్కువ

కుటుంబాల కంటే..కార్డులే ఎక్కువ

ప్రజాసాధికార సర్వే ప్రకారం తాజాగా తేలిందేమంటే రాష్ట్రంలో మొత్తం 1,41,13,797 కుటుంబాలు ఉన్నాయి. కానీ రేషన్ కార్డులు మాత్రం ఇప్పటికే 1,44,00,630 కుటుంబాలకు ఇచ్చేశారు. అంటే 2,86,833 కుటుంబాలకు అదనంగా రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మరో 2.84లక్షల కార్డుల జారీకి పౌరసరఫరాల శాఖ సిద్ధమైంది. ఇవికాకుండా ఇప్పటికే ఉన్న కార్డుల్లో విభజన(స్ల్పిట్‌) కోసం సుమారు 3లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

లెక్కలు చూసి...షాక్!

లెక్కలు చూసి...షాక్!

ఇవన్నీ కలిపితే రాష్ట్రంలో మొత్తం కార్డుల సంఖ్య దాదాపు 1.5 కోట్లకు చేరే అవకాశం ఉంది. అయితే ఈ లెక్కలపై అధికారులు సైతం షాక్ తిన్నారట. కారణం ఉపాధి కోసం పలు ప్రాంతాల్లో కుటుంబాలకు కుటుంబాలు వలసలు వెళ్లాయనుకున్నప్పటికీ ఇంత భారీ స్థాయిలో తేడా వచ్చే అవకాశమే లేదని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డులు ఇలా కుటుంబాలను మించి పెరిగిపోతుండటంపై విస్తు గొలుపుతోంది.

కుటుంబ సభ్యులూ...ఎక్కువే

కుటుంబ సభ్యులూ...ఎక్కువే

మరో ఆశ్చర్యకరమైన వాస్తవం ఏమిటంటే?...ఆయా రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల సంఖ్యకు...వాస్తవంగా ఉన్న వారి సంఖ్యకూ చాలా తేడా ఉందట. కార్డుల్లో 4,15,21,353 మంది కుటుంబ సభ్యులు ఉండగా, ప్రజాసాధికార సర్వేలో మాత్రం 4,43,62,114 మంది ఉన్నట్లు గణాంకాలు తేల్చాయి. ఈ సర్వే ప్రకారం ఒక్కో కుటుంబానికి సగటున 3.14మంది, కార్డుల ప్రకారం సగటున 2.88 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఆయా కార్డులకు సంబంధించి సుమారు 20 లక్షల మంది కార్డుదారులు ప్రతినెలా రేషన్‌ తీసుకోవడం లేదని తెలిసింది. ఆ రకంగా సుమారు 50లక్షల మందికి అందాల్సిన సరుకులు మిగిలిపోతున్నాయని సమాచారం.

రాష్ట్రంలో...అందరూ పేదలేనా?

రాష్ట్రంలో...అందరూ పేదలేనా?

నిబంధనల ప్రకారం రేషన్ కార్డులను దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే మంజూరు చేయాలి. కానీ తాజా లెక్కలు చూస్తే రాష్ట్రంలో అందరూ పేదవాళ్లేనా అనే సందేహం తలెత్తకమానదు. కారణం దాదాపుగా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలు రేషన్‌ పరిధిలోకి వస్తుండటమే. రేషన్ కార్డుల ప్రకారం చూస్తే తేలిన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే...రాష్ట్రంలో మహిళల కంటే పురుషులే 1,56,553మంది ఎక్కువగా ఉన్నారు. 2,08,38,953 మంది పురుషులు ఉండగా , 2,06,82,400మంది మహిళలు ఉన్నట్లు కార్డుల్లో నమోదై ఉంది.

నిబంధనలు...అమలవుతున్నాయా?...

నిబంధనలు...అమలవుతున్నాయా?...

రూల్స్ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.60వేలు, పట్టణాల్లో రూ.70వేలలోపు ఆదాయం ఉన్నవారికే రేషన్ కార్డులు మంజూరు చేయాలి. అలాగే ఏ సౌకర్యాలు కలిగి కార్డు వర్తించదనేది నిబంధనలు ఉన్నాయి వాటి ప్రకారం కుటుంబానికి కారున్నా, నెలకు రూ.500 దాటి కరెంట్ బిల్లు కట్టినా, ఇంటిపన్ను రూ.1000 దాటినా, రెండున్నర ఎకరాలకు మించి మాగాణి, ఐదెకరాలు దాటి మెట్ట భూములు ఉన్నా రేషణ్ కార్డు ఇవ్వకూడదు. అలాగే కొత్తగా రేషన్ కార్డు ఇవ్వాలంటే వారు ప్రజాసాధికార సర్వేలో ఖచ్చితంగా నమోదై ఉండాలి. కానీ కొత్తగా జారీ అవుతున్న కార్డుల సంఖ్య చూస్తే అసలు ఈ నిబంధనలు వర్తింపచేస్తున్నారా?...అనే డౌట్ ఎవరికైనా రాకమానదు. అలాగే స్తున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

English summary
Amaravathi: A shocking fact in the state of Andhra Pradesh has emerged. There are more ration cards than the total number of families in AP. The latest public surveys revealed this truth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X