విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్: మావోయిస్టుల వద్ద 'పెన్ గన్': విస్తుపోయిన పోలీసులు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం:మూడు రోజుల క్రీతం ఛత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ సందర్భంగా మావోయిస్టుల వద్ద లభ్యమైన ఒక ఆయుధం పోలీసులను షాక్ కు గురిచేసింది. చనిపోయిన మావోయిస్టుల వద్ద నుంచి పోలీసులు మందుగుండు, ఆయుధాలు సేకరిస్తుండగా ఈ ఆయుధం లభించగా తొలుత దాన్ని ఆయుధం గా భావించని పోలీసులు ఆ తరువాత అది అత్యాధునికమైన ఆయుధం అని తెలిసి విస్తుపోయారు. ఇంతకీ ఆ ఆయుధం..."పెన్ గన్"...పెన్ను రూపంలో ఉన్న ఈ గన్ను ను నిశితంగా పరిశీలించిన మీదట దాన్ని "లెధల్ పెన్ గన్" గా పోలీసులు నిర్ధారించారు. దీంతో ఈ విషయం దేశవ్యాప్తంగా భద్రతాదళాల్లో చర్చనీయాంశంగా మారింది.

గురువారం...ఎన్ కౌంటర్

గురువారం...ఎన్ కౌంటర్

గురువారం ఛత్తీస్‌ఘడ్‌లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో నలుగురు మహిళా మావోయిస్టులు సహా మొత్తం ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారు.

పెన్ గన్...లభ్యం

పెన్ గన్...లభ్యం

ఎన్‌కౌంటర్ తర్వాత బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లోని సరిహద్దు వెంట ఉన్న టిమినార్, పుస్నార్ గ్రామాలలో జిల్లా రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉమ్మడి బృందం దర్యాప్తులను నిర్వహిస్తున్నప్పుడు ఒక పెన్ను రూపంలో ఉన్న వస్తువు దొరికింది. ఆ తరువాత అది పెన్ గన్ అని తేలింది.

ఆధునికమైన...లెధల్ పెన్ గన్

ఆధునికమైన...లెధల్ పెన్ గన్

అయితే దీన్ని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది నిషితంగా పరిశీలించి ‘లెధల్ పెన్ గన్' అని నిర్ధారించారు. దీంతో పాటు రెండు ఇన్సస్ మరియు రెండు . 303 రైఫిళ్లు మరియు 12 బోర్ షాట్గన్ కూడా స్వాధీనం చేసుకున్నారు.

వాడింది...మహిళా మావోయిస్ట్

వాడింది...మహిళా మావోయిస్ట్

ఈ పెన్ గన్ 9 నుండి 10 మీటర్ల పొడవు ఉంది. ఎన్‌కౌంటర్‌లో గాయపడిన మహిళా మావోయిస్ట్ కమాండర్ జైనని ఇన్సాస్...తాను పారిపోయే క్రమంలో ఈ తుపాకీని వదిలిపెట్టి పోయిందని పోలీసులు తెలిపారు. అంతేకాదు ఆ సమయంలో ఆమె దీని నుంచి రెండు బులెట్లు కాల్సిందని ఏరియా కమాండర్ జైని భైరాంగండ్ చెప్పారు. మావోయిస్టులు ఇలా అత్యాధునికమైన...చేతుల్లో ఇమిడిపోయే పెన్ గన్ లను సమకూర్చుకోవడం పోలీసు శాఖతో పాటు ఉగ్రవాదులను ఎదుర్కొనే భద్రతా దళాల్లో చర్చనీయాంశంగా మారిందని తెలుస్తోంది.

English summary
Visakhapatnam: The Police were found and shocked when they observe Pen Gun at Maoists. The police seized this pen gun at the time of an encounter with the Maoists three days ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X