హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అగ్రిగోల్డ్ వ్యవహారంలో షాకింగ్ ట్విస్ట్:హాయ్ ల్యాండ్ తమది కాదని ప్లేటు ఫిరాయించిన సంస్థ యాజమాన్యం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో శుక్రవారం ఊహించని మలుపు చోటుచేసుకుంది. బాధితులకు పరిహారం చెల్లించే విషయమై ఆస్తుల ప్రస్తావనలో హాయ్ ల్యాండ్ తమదేనని మొదటి నుంచి చెప్పుకొస్తున్న హాయ్ ల్యాండ్ ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయించేసింది.

హై కోర్టులో అగ్రి గోల్డ్ కేసు విచారణ సందర్భంగా హాయ్ ల్యాండ్ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే అగ్రి గోల్డ్ యాజమాన్యం వాదన విన్న ధర్మాసనం వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటిదాకా డిపాజిటర్లను మోసం చేస్తూ వచ్చిన అగ్రి గోల్డ్ యాజమాన్యం ఇప్పుడు ఏకంగా కోర్టును సైతం మోసం చేశారని...దీనికి పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే...

అగ్రి గోల్డ్ కేసు...హై కోర్టు విచారణ

అగ్రి గోల్డ్ కేసు...హై కోర్టు విచారణ

అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంలో భాగంగా హాయ్ ల్యాండ్ ను వేలం వేసే విషయమై ఆ సంస్థ ఎండి అల్లూరి వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ హై కోర్టులో శుక్రవారం విచారణకు వచ్చింది. హాయ్‌ల్యాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద జప్తు చేసిందని...ఈ చట్టం కింద జప్తు చేశాక బ్యాంకులు సర్ఫేసీ చట్టం కింద వేలం వేయడానికి కుదరదని పేర్కొంటూ హాయ్ ల్యాండ్ ఎండీ అల్లూరి వెంకటేశ్వరరావు హై కోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం హాయ్ ల్యాండ్ ఎండి దాఖలు చేసిన పిటిషన్ విచారణ చేపట్టింది.

హాయ్ ల్యాండ్ తో...సంబంధం లేదు

హాయ్ ల్యాండ్ తో...సంబంధం లేదు

ఈ సందర్భంగా అగ్రిగోల్డ్‌ ఆస్తులు,వాటి రిజిస్ట్రేషన్‌,మార్కెట్‌ విలువలను గురించి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణప్రకాశ్‌ హై కోర్టుకు అందచేశారు. ఈ సందర్భంలో హాయ్‌ల్యాండ్‌తో అగ్రిగోల్డ్‌కు సంబంధంలేదని హాయ్ ల్యాండ్ తరఫు సీనియర్‌ న్యాయవాది శ్రీధరన్‌ ధర్మాసనంకు తెలిపారు.హాయ్ ల్యాండ్ ఒక ప్రత్యేక సంస్థ అని...పైగా ఈ సంస్థ ఆస్తులను ఏపీ డిపాజిటర్ల చట్టం కింద జప్తు చేశారని, అలా చేసిన హాయ్ ల్యాండ్ ను మళ్లీ సర్ఫేసీ చట్టం కింద బ్యాంకులు వేలం వేసేందుకు యత్నించడం చట్టవిరుద్ధమని శ్రీధరన్‌ వాదించారు. ఈ వాదనలు ఈ పిటిషన్ పరిశీలించిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అగ్రిగోల్డ్‌ యాజమాన్యం తీరు, హాయ్ ల్యాండ్ ఎండి వాదనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ధర్మాసనం...తీవ్ర ఆగ్రహం

ధర్మాసనం...తీవ్ర ఆగ్రహం

ఈ విషయమై అగ్రిగోల్డ్‌ యాజమాన్యం తరఫు న్యాయవాది జానకిరామిరెడ్డిని ధర్మాసనం ప్రశ్నించగా హాయ్ ల్యాండ్ తో తమకు సంబంధం లేని విషయం వాస్తవమే అన్నారు. దీంతో ఆగ్రహం చెందిన ధర్మాసనం మరి మీకు సంబంధం లేనప్పుడు ఇంతకాలం హాయ్‌ల్యాండ్‌ వేలానికి ఎందుకు అడ్డు పడుతూ వచ్చారని...మార్కెట్‌ వ్యాల్యూలను కోర్టుకు ఎందుకు సమర్పించారని ప్రశ్నించింది. అగ్రి గోల్డ్ యాజమాన్యం న్యాయస్థానానికి సైతం విచారణ సందర్భంలో ఒక్కోసారి ఒక్కో వాదనతో తాము ఇచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేస్తోందని...ఈ విధమైన తీరుతో అటు డిపాజిటర్లతో పాటు ఇటు న్యాయస్థానాన్ని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరోవైపు ఈ విషయం గురించి దర్యాప్తులో ఇప్పటిదాకా ఏమీ తేల్చని సీఐడీ తీరుపైనా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.

సిఐడి తీరు...తప్పుబట్టిన హైకోర్టు

సిఐడి తీరు...తప్పుబట్టిన హైకోర్టు

హాయ్‌ల్యాండ్‌ ఆస్తులను జప్తు చేసినపుడు దాని యజమానులను ఎందుకు నిందితులుగా చేర్చలేదని, వారిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదని సీఐడీని ధర్మాసనం ప్రశ్నించగా వారు ఈ కేసులో నిందితులు కాదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలా అయితే వాళ్లు పిటిషన్‌ వేసేదాకా ఆ విషయం ఎందుకు తెలుసుకోలేకపోయారని సిఐడిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరిగినపుడు సైతం ఈ విషయాన్ని ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించింది. సిఐడి విచారణ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాగైతే దర్యాప్తు బాధ్యతలను సిట్‌కు అప్పగించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అగ్రిగోల్డ్‌ ఛైర్మన్‌ అవ్వా సీతారామమూర్తి, హాయ్‌లాండ్‌ ఎండీకి ఉన్న అనుబంధం గురించి నివేదిక ఇవ్వాలని, వారిపై చట్టపరంగా తీసుకునే చర్యల గురించి వివరించాలని సీఐడీని ఆదేశించింది.

తదుపరి విచారణ...ఈ నెల 23కి వాయిదా

తదుపరి విచారణ...ఈ నెల 23కి వాయిదా

ఇప్పటిదాకా హాయ్ ల్యాండ్ తమదేనని తప్పుడు సమాచారంతో డిపాజిటర్లను మోసం చేస్తూ వచ్చిన అగ్రి గోల్డ్ యాజమాన్యం ఇప్పుడు న్యాయస్థానాన్ని కూడా మోసం చేసినట్లు అర్థమవుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వివిధ రకాల వాదనలతో కోర్టులతోనే ఆటలాడుకుంటున్న అగ్రి గోల్డ్ యాజమాన్యం అందుకు తగిన పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని ధర్మాసనం తీవ్రంగా హెచ్చరించింది. హాయ్‌ల్యాండ్‌ ఎండీ దాఖలు చేసిన పిటిషన్‌ నేపధ్యంలో కర్ణాటక, ఎస్‌బీఐ, ఓబీసీ బ్యాంకులతో పాటు రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, సీఐడీ అదనపు డీజీలను ప్రతివాదులుగా చేర్చి హై కోర్టు నోటీసులు జారీ చేసింది. హాయ్‌ల్యాండ్‌ తమది కాదని చెబుతున్న అగ్రి గోల్డ్ అందుకు తగిన ఆధారాలను చూపాలని ఆదేశిస్తూ హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.

English summary
Hyderabad: An unexpected twist took place in Agri gold case probe in High court on Friday. Agri Gold owner's change their word over hailand. Hailand advocate told to High court that AgriGold didn't has any relation with Hailand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X