హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిగరెట్‌ అప్పుగా ఇవ్వలేదని దాడి, షాప్ ఓనర్ మృతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కృష్ణా జిల్లాలోని వీరులపాడులో దారుణం జరిగింది. సిగరెట్‌ అప్పుగా ఇవ్వలేదని ఓ వ్యక్తి కిరాణా షాపు యజమానిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో కిరాణా షాపు యజమాని మృతి చెందాడు.

ఆటోలు ఢీకొని ఏడేళ్ల బాలుడు మృత్యువాత

రెండు ఆటోలు ఢీకొన్న ప్రమాదంలో ఏడేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటలో జరిగింది. రామన్నపేట బ్రిడ్జి వద్ద ఓ లగేజీ ఆటో, ప్రయాణికులతో వస్తోన్న మరో ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న జశ్వంత్ కుమార్(7) అనే బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

Shop owner attacked because refused to give cigarette

ప్రమాదం జరిగినప్పుడు లగేజీ ఆటో నడుపుతున్న డ్రైవర్ మత్తుగా తాగి ఉన్నాడని తెలుస్తోంది. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న స్ధానికులు అతడిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వ్యాను బోల్తా 12 మందికి గాయాలు

పెళ్లి బ్యాండు బృందంతో వెళుతున్న ఓ వ్యాను బోల్తా పడటంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని టీబీ జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో అదుపుతప్పి బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పది మంది బ్యాండ్ బృంద సభ్యులు సహా 12 మంది గాయపడగా వారిని పాతపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పిచ్చికుక్క స్వైర విహారం: ఆరుగురికి తీవ్ర గాయాలు

శ్రీకాకుళం జిల్లాలోని సారవకోట మండలం వెంకన్నపాలెంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

English summary
Shop owner attacked by a customer. Because he refused to give cigarette in Krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X