కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘అందంగా ఉంటావు.. మీ ఇంటికి రానా?’: మహిళకు ఎస్ఐ వేధింపులు

|
Google Oneindia TeluguNews

కర్నూలు: మహిళలకు అండగా ఉండాల్సిన బాధ్యత గల పోలీసు వృత్తిని నిర్వర్తిస్తూ ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ అధికారి. దీంతో చివరికి బాధితురాలు ఆధారాలతో సహా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అతడిని వీఆర్‌కు (వేకెన్సీ రిజర్వుడు) పంపుతూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన కర్నూలులో చోటు చేసుకుంది.

ఆ వివరాల్లోకి వెళితే.. సారా కేసు పేరుతో కర్నూలు జిల్లా ఆత్మకూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ మహిళను ఆత్మకూరు ఎస్సై వెంకటసుబ్బయ్య నిరంతరం లైంగికవేధింపులకు గురి చేశాడు.

SI asked to go on leave for alleged sexual harassment

'నువ్వు అందాగా ఉంటావు.. మీ ఇంటికి రావాలా?' అంటూ ఆమెను వేధించాడు.
ఆమెకు పలుమార్లు అర్ధరాత్రి ఫోన్‌ చేసి ఇబ్బందులు పెట్టేవాడు. చివరికి ఆమె తన భర్త, పిల్లలతో కలిసి కర్నూలులో ఎస్పీ గోపీనాథ్‌‌కి ఫిర్యాదు చేశారు.

అతను ఫోన్‌ చేసినప్పుడునమోదు చేసిన వివరాలు, ఫోన్‌ నంబర్లను అందజేశారు. దీంతో ఎస్సైను వీఆర్‌కు పంపుతూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. విచారణ జరిపి నివేదిక అందజేయాలని అదనపు ఎస్పీ మాధవరెడ్డిని ఆదేశించినట్లు తెలిసింది.

English summary
Local SI Venkata Subbaiah was on Sunday asked to proceed on VR (vacancy reserve) as a woman complained to SP Gopinath against the SI of sexual harassment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X