విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో ఏడాదిగా నిశబ్ద యుద్ధం - సైనికులకు సీఎం జగనే స్ఫూర్తి - అందరి చూపు ఇటేనంటోన్న వైసీపీ

|
Google Oneindia TeluguNews

''ప్రస్తుతం దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నది. ఎందుకంటే గాంధీజీ కలలను సాకారం చేస్తున్న రాష్ట్రం మనది. రాష్ట్రవ్యాప్తంగా పదిహేను వేలకు పైగా సచివాలయాలను ఏర్పాటు చేయడంతో దాదాపు నాలుగు లక్షల మంది సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఉపాధి పొంది.. పేదలకు సేవచేస్తున్నారు. సచివాలయ వ్యవస్థతో రాష్ట్రంలో అవినీతి రహిత పాలనకు అడుగులు పడ్డాయి. కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా పేదల ముంగిటికి పథకాలు అందుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను స్ఫూర్తిగా తీసుకుని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా వలంటీర్లందరూ సైనికుల్లా పనిచేయాలి. సీఎం స్పూర్తితో రాష్ట్రం గ్రామస్వరాజ్యం వైపు పయనిస్తోంది'' అని డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా అన్నారు.

అసెంబ్లీ సాక్షిగా తల్లి మెడపై కత్తి పెట్టి.. అవినీతి మంత్రుల్ని అరెస్టు చేయాలంటూఅసెంబ్లీ సాక్షిగా తల్లి మెడపై కత్తి పెట్టి.. అవినీతి మంత్రుల్ని అరెస్టు చేయాలంటూ

వాంటీర్, సచివాలయ వ్యవస్థకు ఏడాది..

వాంటీర్, సచివాలయ వ్యవస్థకు ఏడాది..

మహాత్మా గాంధీ కన్న కలలు.. ఏపీ సీఎం జగన్ నిర్ణయాలతో సాకారం అవుతున్నాయని, గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా రాష్ట్రం పయనిస్తోందని, ప్రభుత్వ పథకాలు పేదల ఇంటిముంగిటికి చేరుతున్నాయని, గ్రామసచివాలయ వ్యవస్థ వల్లే ఇదంతా సాధ్యమైందని, దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా సచివాలయ వ్యవస్థను ప్రశంసిస్తున్నాయని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్‌కు నీరాజనాలు పలుకుతూ శుక్రవారం పలు కార్యక్రమాలు జరిగాయి.

పవన్ కల్యాణ్ జోలికొస్తే ఖబర్దార్: సీపీఐ నారాయణకు బీజేపీ సోము వీర్రాజు వార్నింగ్పవన్ కల్యాణ్ జోలికొస్తే ఖబర్దార్: సీపీఐ నారాయణకు బీజేపీ సోము వీర్రాజు వార్నింగ్

30 అడుగుల జగన్ కటౌట్..

30 అడుగుల జగన్ కటౌట్..

సచివాలయ వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా... గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్వర్యంలో విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో 30 అడుగుల సీఎం కటౌట్‌ ఏర్పాటు చేశారు. క్రేన్‌ సహాయంతో సీఎం కటౌట్‌కి డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాలాభిషేకం చేశారు. పూల వర్షం కురిపించారు. తాము ఉపాధి పొందుతూ, పేదలకు సేవలచేసే భాగ్యం కల్పించిన సీఎం జగన్‌కు వాలంటీర్లు కృతజ్ఞతలు లెాపీరు. రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో పని చేస్తామని ప్రతినబూనారు. గాంధీజీ, వైఎస్సార్ చిత్రపటాలకు నివాళులు అర్పించారు.

Recommended Video

#GramaSwarajyamInAP : గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేస్తున్న వారికి CM Jagan అభినందనలు! || Oneindia
ఏడాదిగా ఏపీలో నిశబ్ద యుద్దం..

ఏడాదిగా ఏపీలో నిశబ్ద యుద్దం..


గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే మల్దాది విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. లక్షల్లో ఉద్యోగాలు కల్పించి, కోట్ల మందికి సేవలు అందించాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని, దళారీ వ్యవస్థని సమూలంగా నిర్మూలించేందుకే సచివాలయ వ్యవస్థ. పేదల చెంతకే ఫలాలు అందించేందుకు ఏడాది కాలంగా నిశ్శబ్ధ యుద్ధం జరుగుతోందని, బాపూజీ కలలు సాకారం చేసే దిశగా గ్రామస్వరాజ్య స్థాపన జరుగుతోందని విష్ణు అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నగరాధ్యక్షులు బొప్పన భవకుమార్‌, పూనూరు గౌతమ్‌ రెడ్డి తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు.

English summary
On the occasion of the completion of the year in which the village secretariat system was set up, appreciation were extended to CM Jagan across the state. Under the auspices of the Village and Ward Secretariat Employees Federation, a 30-foot CM cutout has been set up on Vijayawada BRTS Road. Deputy CM Anjad Bhasha, MLA Malladi Vishnu anointed CM Cutout with the help of crane.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X