వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా సంగతి చూసేందుకే వచ్చారట, కత్తులెందుకు, ఇక ఊరుకోం: కాల్పులపై శిల్పా, ఇదీ జరిగింది

నంద్యాలలో టిడిపి నేత అభిరుచి మధు గాల్లోకి కాల్పులు ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. దీనిపై శిల్పా చక్రపాణి రెడ్డి ఓ టీవీ ఛానల్‌తో స్పందించారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాలలో టిడిపి నేత అభిరుచి మధు గాల్లోకి కాల్పులు ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. దీనిపై శిల్పా చక్రపాణి రెడ్డి ఓ టీవీ ఛానల్‌తో స్పందించారు. శిల్పాపై భూమా వర్గీయులు కాల్పులు జరిపారని, ఆయన తృటిలో తప్పించుకున్నారని చెబుతున్నారు.

చదవండి: కాల్పులు: శిల్పా చక్రపాణి రెడ్డిపై హత్యాయత్నమంటూ ప్రచారం

ఈ నేపథ్యంలో శిల్పా చక్రపాణి రెడ్డి అక్కడేం జరిగిందనే విషయం చెప్పారు. మేం ఎప్పుడు దాడి చేయలేదని, ప్రశాంత వాతావరణం లేకుంటే ఎలా బతుకుతామని, అక్కడకు టిడిపి నేతలు కత్తులు, తుపాకులు ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు.

నా వాహనం వెళ్లకుండా అడ్డుకున్నారు

నా వాహనం వెళ్లకుండా అడ్డుకున్నారు

తాను మైనార్టీ నేత చింపింగ్ అంత్యక్రియలకు వెళ్లానని, టిడిపి నేతలు అటకాయించారని శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పారు. అప్పుడు తన వాహనం ముందుకు వెళ్లకుండా భూమా వర్గీయులు వారి కారుతో అడ్డుకున్నారని చెప్పారు. కారు పక్కకు తీయమంటే రెచ్చిపోయారన్నారు.

Recommended Video

Nandyal Bypoll : Cases Registered Against YS Jagan | Oneindia Telugu
ఇదేమిటని ప్రశ్నిస్తే మీ సంగతి చూసేందుకే వచ్చామని

ఇదేమిటని ప్రశ్నిస్తే మీ సంగతి చూసేందుకే వచ్చామని

తనను అడ్డుకోవడంతో ఇదేమిటని తాను టిడిపి వర్గీయులను ప్రశ్నించానని శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పారు. దానికి వాళ్లు మీ సంగతి చూస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ సంగతి చూసేందుకే ఇక్కడకు వచ్చామని హెచ్చరించారన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే తమపై దాడి చేశారన్నారు.

చేతుల్లో గన్‌లు, కారులో వేట కొడవళ్లు

చేతుల్లో గన్‌లు, కారులో వేట కొడవళ్లు

టిడిపి వర్గీయుల చేతుల్లో గన్‌లు ఉన్నాయని శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పారు. వారి కార్లలో వేట కొడవళ్లు ఉన్నాయని ఆరోపించారు. పోలీసులకు విషయం చెబితే వారికే వత్తాసు పలికారన్నారు. పోలీసులు నిదానంగా వచ్చి అందర్నీ పంపించే ప్రయత్నం చేశారన్నారు.

వాళ్లే రెచ్చగొట్టారు, మధు వీరంగం

వాళ్లే రెచ్చగొట్టారు, మధు వీరంగం

మొన్న మా ఇంటిపై దాడి చేశారని, నిన్న తమ కౌన్సెలర్‌ను కొట్టారని, ఇప్పుడు తనపై దాడి చేశారని శిల్పా చక్రపాణి రెడ్డి ఆరోపించారు. కొత్త సూరజ్ హోటల్ వద్ద దాడి జరిగిందంటే, పాత సూరజ్ హోటల్ వద్దకు వెళ్లాలని పోలీసులు చెప్పారన్నారు. టిడిపి నేతలో మొదట రెచ్చగొట్టారన్నారు.

భయపడేది లేదు, మళ్లీ దాడి చేస్తే

భయపడేది లేదు, మళ్లీ దాడి చేస్తే

టిడిపి చర్యలకు తాము ఎట్టి పరిస్థితుల్లోను భయపడేది లేదని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. మా కార్యకర్తలు కూడా భయపడరని చెప్పారు. మేం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటామని చెప్పారు. టిడిపి నేతలు ప్రతిసారి రౌడీయిజం చూపిస్తున్నారని, మరోసారి దాడి చేస్తే ఊరుకునేది లేదన్నారు.

ఇరువర్గాల్లో ఎవరికి గాయాలు కాలేదు, అందుకే వెనక్కి తగ్గాం

ఇరువర్గాల్లో ఎవరికి గాయాలు కాలేదు, అందుకే వెనక్కి తగ్గాం

పరస్పరం దాడిలో ఇరువర్గాల్లోని వారికి ఎవరికీ గాయాలు కాలేదని శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పారు. కానీ కారు అద్దం మాత్రం పగిలిందని తెలిపారు. శాంతియుతంగా ఉండాలనే తాము వెనక్కి తగ్గామని, మరోసారి మాత్రం ఊరుకునేది లేదన్నారు.

టిడిపి నేతలు ఆయుధాలు దగ్గరుంచుకున్నారని..

టిడిపి నేతలు ఆయుధాలు దగ్గరుంచుకున్నారని..

కాగా, ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే అందరూ ఆయుధాలను పోలీస్ స్టేషన్లో అప్పగించాలి. నిబంధనల ప్రకారం గన్‌తో పాటు బుల్లెట్లు కూడా డిపాజిట్ చేయాలి. కౌంటింగ్ పూర్తయ్యే వరకు పిఎస్‌లోనే ఆయుధాలు ఉంచాలి. కానీ టిడిపి నేతలు తమ వద్దే ఆయుధాలు ఉంచుకున్నారని వైసిపి చెబుతోంది.

English summary
YSR Congress Party leader and Former MLC Silpa Chakrapani Reddy on Thursday responded on firing in Nandyal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X