వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసులు, ఆసుపత్రిలోనే టిక్కెట్టుపై ఆరా, శిల్పాపై అఖిలప్రియ షాకింగ్ కామెంట్స్

నాన్న ఆసుపత్రిలో సీరియస్‌గా ఉంటే తర్వాత పోటీచేసే అభ్యర్థి ఎవరని ప్రశ్నించిన వ్యక్తి మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి మంత్రి భూమా అఖిలప్రియ చెప్పారు. శిల్పా మోహన్‌రెడ్డి పార్టీలో ఉంటే నష్టం జరిగేదని అఖ

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: నాన్న ఆసుపత్రిలో సీరియస్‌గా ఉంటే తర్వాత పోటీచేసే అభ్యర్థి ఎవరని ప్రశ్నించిన వ్యక్తి మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి మంత్రి భూమా అఖిలప్రియ చెప్పారు. శిల్పా మోహన్‌రెడ్డి పార్టీలో ఉంటే నష్టం జరిగేదని అఖిలప్రియ అభిప్రాయపడ్డారు. నంద్యాలలో విజయం సాధిస్తామని అఖలప్రియ ధీమాను వ్యక్తం చేశారు.

నంద్యాల అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక వచ్చే నెల 23వ, తేదిన జరగనున్నాయి. ఈ ఎన్నికను అధికార టిడిపి, వైసీపీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రెండు పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.

నంద్యాల ఉపఎన్నికను విజయం సాధించేందుకుగాను ఎనిమిది మంది మంత్రులు మకాం వేశారు. మరో వైపు 12 మంది ఎమ్మెల్యేలను అధికార పార్టీ నంద్యాలలో మకాం వేసింది. వైసీపీ కూడ ఈ ఎన్నికల్లో విజయం సాధించేందకు అన్ని శక్తులను కూడదీసుకొంది.

ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియను తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ చేశారు. ఎన్నికల్లో అనుసరిస్తున్న వ్యూహన్ని, శిల్పాతో ఉన్న విబేధాలపై ఆమె నోరువిప్పారు.

సీరియస్‌గా ఉంటే టిక్కెట్టు కోసం ఆరా

సీరియస్‌గా ఉంటే టిక్కెట్టు కోసం ఆరా

భూమా నాగిరెడ్డి ఆసుపత్రిలో సీరియస్‌గా ఉన్న సమయంలో నెక్ట్స్ టిక్కెట్టు ఎవరికీ అంటూ శిల్పా మోహన్‌రెడ్డి చర్చించారని, ఈ మాటలను విన్న తాను శిల్పామోహన్‌రెడ్డిని వెళ్ళిపోవాలని చెప్పి పంపానని ఆమె గుర్తుచేసుకొన్నారు. కనీసం అప్పటికి నాగిరెడ్డి చనిపోయినట్టు కూడ ప్రకటించలేదని అఖిలప్రియ చెప్పారు. ఈ రకమైన మనస్థత్వం ఉన్న వ్యక్తి పార్టీలో ఉంటే లాభం కంటే నష్టమే ఎక్కువని ఆమె అభిప్రాయపడ్డారు

.శిల్పా మోహన్‌రెడ్డి పార్టీలో ఉంటే నష్టమే జరిగేది

.శిల్పా మోహన్‌రెడ్డి పార్టీలో ఉంటే నష్టమే జరిగేది

పార్టీలో శిల్పా మోహప్‌రెడ్డి టిడిపిలో ఉంటే తమకు నష్టమే జరిగేదని ఆమె అభిప్రాయపడ్డారు. నంద్యాలలో ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా ఏం చేయలేదని చెప్పి ప్రచారం చేస్తూ ప్రస్తుతం ఓట్లు అడుగుతున్నట్టు చెప్పారు. శిల్పా మోహన్‌రెడ్డి పార్టీలో ఉంటే ఏం ప్రచారం చేసేవాళ్ళమో అర్ధం కాదన్నారు. మోహన్‌రెడ్డిని పార్టీ నుండి బయటకు పంపించాల్సిన అవసరం తనకు లేదన్నారు.

నాన్నను శిల్పా ఇబ్బందిపెట్టారు

నాన్నను శిల్పా ఇబ్బందిపెట్టారు


అమ్మ చనిపోయి రెండు మాసాలు కూడ దాటలేదు. కానీ, శిల్పా మోహన్‌రెడ్డి నాన్నపై అనేక కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని ఆమె చెప్పారు. ఆ సమయంలో
నంద్యాలలో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పాను. ఆ మాటకు కట్టుబడి ఉన్నాను. శిల్పాకు మాకు ఫ్యాక్షన్ గొడవలు లేవన్నారు. అయినా శిల్పా అపరిపక్వంగా వ్యవహరించేవాడినని చెప్పారు.

అమ్మను చూసి నేర్చుకొన్నా

అమ్మను చూసి నేర్చుకొన్నా

అమ్మను చూసి నేర్చుకొన్నా.. గతంలో అమ్మ ఏ రకంగా ఆళ్ళగడ్డ సమస్యలను పరిష్కరించుకొనేందుకు ఏ రకంగా ప్రయత్నించారోనని వీడియోలు చూశాను. అమ్మను ఏ సమస్యపై ఎలా స్పందించే వారనే విషయమై చూసి నేర్చుకొన్నాను. అయితే తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన కొత్తలో ఆళ్ళగడ్డ నుండి పార్టీ కార్యకర్తలు నాన్నను కలిసి ఆళ్ళగడ్డ సమస్యలు చెప్పేవారని, అయితే నాన్న వారిని తన వద్దకు పంపేవారని, ఆ రకంగా పార్టీ కార్యకర్తలతో నేరుగా సంబంధాలు ఏర్పడ్డాయని ఆమె గుర్తుచేశారు

టిడిపిలో చేరే సమయంలో తీవ్రంగా చర్చించా

టిడిపిలో చేరే సమయంలో తీవ్రంగా చర్చించా

తాను చిన్నప్పుడు తమ కుటుంబం టిడిపిలో ఉంది. అయితే ఆ సమయంలో తమకు రాజకీయాలపై అంతగా అవగాహన లేదు. అయితే తాను రాజకీయాల్లో వచ్చిన సమయంలో తమ కుటుంబం వైసీపిలో ఉందన్నారు. అయితే టిడిపిలో చేరాలనే ప్రతిపాదన వచ్చిన సమయంలో పార్టీలో చేరే విషయమై తీవ్రంగా చర్చించినట్టు చెప్పారు. పార్ట మారే ప్రతిపాదన వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై చర్చించినట్టు చెప్పారు. అయితే ఎట్టకేలకు పార్టీ మారినట్టు చెప్పారు.

ఎవరిని వేధించలేదు

ఎవరిని వేధించలేదు

తాను ఎవరిని వేధించలేదన్నారు. తనకు ఎవరిని కూడ వేధఇంచాల్సిన అవసరం కూడ లేదన్నారు. నాన్న చనిపోయిన తర్వాత నన్ను నేనుగా ఫ్రూవ్ చేసుకోవాలని భావించానని చెప్పారు. అయితే ఏవీ సుబ్బారెడ్డితో తనకు అగాధం లేదన్నారు. కూతురు లాంటిదాన్ని చెప్పారు. సుబ్బారెడ్డి కూతురుతో కలిసి ఉన్న విషయాన్ని ఆమె గుర్తుచేసుకొన్నారు. అయితే నన్ను ఫ్రూవ్ చేసుకోవాలని భావించినట్టు చెప్పారు. అయితే సుబ్బారెడ్డి కూడ తనకంటూ తాను నిరూపించుకోవాలని భావించి ఉండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

చెల్లెలు పోటీ చేయడంపై తప్పుడు ప్రచారం

చెల్లెలు పోటీ చేయడంపై తప్పుడు ప్రచారం

నంద్యాలలో ఎవరూ పోటీచేయాలనే దానిపై తీవ్రంగా చర్చించినట్టు ఆమె చెప్పారు. అయితే చెల్లెలు కుటుంబాన్ని చూసుకోవాలనే బాధ్యతలను అప్పగించామన్నారు. బ్రహ్మనందరెడ్డి , తాను రాజకీయాల్లో కొనసాగాలని కుటుంబమంతా నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు. అయితే ఈ విషయంలో కూడ తప్పుడు ప్రచారం సాగిందన్నారు. తన చెల్లెలు కూడ పోటీచేయాలనే ప్రచారం కూడ బయటకు వచ్చింది.

English summary
Former minister silpa mohan reddy harassed my father with cases said ap tourism minister bhuma akhila priya. A telugu news channel interviewed her on sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X