కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోదరుడితో వాగ్వాదం, వైసిపిలోకి శిల్పా మోహన్? అఖిలపై జగన్ పావులు

టిడిపి సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి టిడిపిని వీడేందుకు సిద్ధమయ్యారా? రెండు రోజుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారా?

|
Google Oneindia TeluguNews

కర్నూలు: టిడిపి సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి టిడిపిని వీడేందుకు సిద్ధమయ్యారా? రెండు రోజుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారా? టిడిపి టిక్కెట్ ఇవ్వకుంటే ఆ వైసిపి నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారా?

<strong>శిల్పకు షాక్.. నంద్యాలను వదలం, టీవీ ఛానల్ పెడతా: మౌనిక, తెరపైకి ఆ పేరు </strong>శిల్పకు షాక్.. నంద్యాలను వదలం, టీవీ ఛానల్ పెడతా: మౌనిక, తెరపైకి ఆ పేరు

అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. భూమా నాగిరెడ్డి మృతితో నంద్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ సూచించిన లేదా భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులకే టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారని తెలుస్తోంది.

తీవ్ర అసంతృప్తిలో శిల్పా మోహన్ రెడ్డి

తీవ్ర అసంతృప్తిలో శిల్పా మోహన్ రెడ్డి

ఈ నేపథ్యంలో శిల్పా మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైసిపిలో చేరి అయినా సరే టిక్కెట్ దక్కించుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. 2014లో భూమాపై తాను పోటీ చేశానని, ఇప్పుడు కూడా తనకే టిక్కెట్ ఇవ్వాలని శిల్పా పట్టుబడుతున్నారు.

కానీ, భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరారని, ఆ తర్వాత ఆయన మృతి చెందారని, కాబట్టి వారి కుటుంబానికే ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించిందని తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో శిల్పా మోహన్ రెడ్డి అవసరమైతే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది.

త్వరలో జగన్‌తో భేటీ

త్వరలో జగన్‌తో భేటీ

త్వరలో హైదరాబాద్ వెళ్లనున్నారని, అక్కడ వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అవుతారని అంటున్నారు. ఆ తర్వాత కర్నూలు వచ్చి తన అనుచరులు, కార్యకర్తలతో మాట్లాడి ఓ ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. మొత్తానికి పోటీ చేసేందుకే సిద్ధమయ్యారంటున్నారు.

సోదరుడితో వాగ్వాదం

సోదరుడితో వాగ్వాదం

భూమా నాగిరెడ్డితో సీఎం చంద్రబాబు సయోధ్య కుదిర్చి, తనను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించారని, వచ్చే ఎన్నికల్లో నంద్యాల ఎంపీ, అసెంబ్లీ టిక్కెట్ మనకే ఇస్తామని చెప్పారని, కాబట్టి ఓపిక పట్టాలని శిల్పా చక్రపాణి రెడ్డి సోదరుడు శిల్పా మోహన్ రెడ్డికి చెప్పారని తెలుస్తోంది. ఈ విషయంలో ఇరువురికి వాగ్వాదం కూడా జరిగిందని సమాచారం.

2019లో రెండు టిక్కెట్లు ఇస్తామని చెప్పినప్పటికీ శిల్పా మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు పోటీ చేస్తానని పట్టుబడుతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు టిక్కెట్ కోరుకున్న అఖిలప్రియ కుటుంబ సభ్యులు 2019లో వదులుకునేందుకు ఎలా సిద్దపడాతారనేది ఆయన వర్గం వాదనగా తలుస్తోంది.

ఎలాగూ టిక్కెట్ భూమా కుటుంబానికి కన్‌ఫర్మ్ అయిందని చెబుతున్నారు. కాబట్టి కచ్చితంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.

జీర్ణించుకోలేకుండా జగన్.. అఖిలకు శిల్పాతో చెక్

జీర్ణించుకోలేకుండా జగన్.. అఖిలకు శిల్పాతో చెక్

భూమా కుటుంబం టిడిపిలో చేరడాన్ని జగన్ జీర్ణించుకోవడం లేదు. కాబట్టి శిల్పా మోహన్ రెడ్డితో భూమా అఖిల ప్రియ కుటుంబానికి చెక్ చెప్పేందుకు జగన్ సిద్ధమని అంటున్నారు. శిల్పాకు మంచి పట్టు ఉంది.

2014లో అది తమ సీటే కాబట్టి తాము కచ్చితంగా పోటీ చేస్తామని జగన్ ప్రకటిచారు. మరోవైపు శిల్పా మోహన్ రెడ్డి ఎలాగైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

గెలుపు కోసం శిల్పా.. తమ పార్టీ నుంచి అభ్యర్థిని గెలుపించుకోవడం కోసం పట్టున్న శిల్పా మోహన్ రెడ్డిని తీసుకునేందుకు జగన్ ఒక్కటవవుతారని అంటున్నారు.

రేసులో సీనియర్లు

రేసులో సీనియర్లు

మరికొందరు సీనియర్లు రేసులో ఉన్నా భూమా కుటుంబానికి టిక్కెట్ ఇస్తే అభ్యంతరం లేదని చెప్పారని తెలుస్తోంది. ఇతరులకు ఇవ్వాల్సి వస్తే మాత్రం తమకు ఇవ్వాలని రేసులోకి వస్తున్నారు.

డోంట్ కేర్

డోంట్ కేర్

అయితే, శిల్పా మోహన్ రెడ్డి పార్టీ మారినా వచ్చే ఇబ్బందులేవీ ఉండవని, సులభంగా గెలుస్తామని తెలుగుదేశం పార్టీ కూడా అంతే ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. భూమా కుటుంబానికి ఉన్న పట్టు, వారి కుటుంబం నుంచి పోటీ చేస్తే మద్దతిస్తామని సీనియర్లు చెప్పడం, శిల్పా చక్రపాణి రెడ్డి సహకారం.. ఇలా అన్ని కలిపి టిడిపి గెలుపు సాధ్యమని భావిస్తున్నారు.

English summary
It is said that Telugudesam Party senior leader Silpa Mohan Reddy may join YSR Congress Party soon. He will met YSRCP chief YS Jaganmohan Reddy soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X