వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జగన్ కడపలో బాబాయిని గెలిపించలేదు కానీ', రెండోసారి.. బాబుకు శిల్పా చేయి

వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన బాబాయి వైయస్ వివేకానంద రెడ్డిని గెలిపించుకోలేకపోయారని,

|
Google Oneindia TeluguNews

నంద్యాల: వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన బాబాయి వైయస్ వివేకానంద రెడ్డిని గెలిపించుకోలేకపోయారని, ఇక నంద్యాలకు వచ్చి శిల్పా మోహన్ రెడ్డిని గెలిపిస్తారా అని టిడిపి ప్రశ్నించింది.

అఖిలకు ఊరట: టిడిపిలోకి 'రెడ్డి' నాయకులు!అఖిలకు ఊరట: టిడిపిలోకి 'రెడ్డి' నాయకులు!

ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌ తాను మాజీ సీఎం కొడుకు అని, తాను కూడా ముఖ్యమంత్రి అవుతానని అనుకుంటున్నారన్నారని ఎద్దేవా చేశారు. అలా ఎప్పటికీ జరగదన్నారు.

రాజుగారి కొడుకు రాజు కావొచ్చు కానీ

రాజుగారి కొడుకు రాజు కావొచ్చు కానీ

రాజుగారి కొడుకు రాజు కావచ్చు, కానీ మాజీ ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కావాలంటే ప్రజాభిమానం కావాలని కేఈ అన్నారు. నంద్యాలలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి జగన్‌కు కాళ్లూ, చేతులు ఆడటం లేదన్నారు. అమరావతిలో అభివృద్ధి అడ్డుకునే ప్రయత్నం చేసి విఫలమై నంద్యాలలో జరిగే అభివృద్ధి అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు.

Recommended Video

Chandrababu discussions In co ordination meeting Over strategies for Nandyal by-polls
ఓటు వేయలేదని శిల్పా అద్దె పెంచాడు

ఓటు వేయలేదని శిల్పా అద్దె పెంచాడు

అవినీతిలో పుట్టి, అవినీతిలో పెరిగి సాక్షిని అడ్డం పెట్టుకుని వైసిపి అభివృద్ధి నిరోధకుల పార్టీగా మారిందని కేఈ ఆరోపించారు. వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో పట్టణంలోని ముస్లింలు తనకు ఓట్లు వేయలేదని పురపాలక కార్యాలయాన్ని చేతిలో పెట్టుకుని మార్కెట్లో 70 మంది వ్యాపారులకు చెందిన దుకాణాలకు వేలం నిర్వహించి పెద్ద మొత్తంలో అద్దెలు పెంచాడని, వాళ్లలో 60 మంది ముస్లింలు ఉన్నారన్నారు. శిల్పాను కాంగ్రెస్‌ అభ్యర్థిగానే ప్రజలు గుర్తు పెట్టుకున్నారని అన్నారు.

రెండోసారి సోదరుడితో...

రెండోసారి సోదరుడితో...

గత నెల 31వ తేదీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నంద్యాల 12వ వార్డులో వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి పర్యటించారు. అదే వార్డులో ఉన్న సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి ఇంటికి వెళ్లారు. తనకు మద్దతివ్వాలని, పార్టీలో చేరాలని కోరారు. దీంతో టిడిపి రంగంలోకి దిగి, చక్రపాణి రెడ్డిని బుజ్జగించింది. కానీ అవి ఫలించలేదు.

చక్రపాణి రెడ్డితో శిల్పా మోహన్ రెడ్డి భేటీ

చక్రపాణి రెడ్డితో శిల్పా మోహన్ రెడ్డి భేటీ

మంగళవారం శిల్పా చక్రపాణి రెడ్డి కార్యకర్తలతో భేటీ అయ్యారు. కార్యకర్తలు, అనుచరుల అభిప్రాయాలను రాత్రి వరకు తెలుసుకున్నారు. ఈ సమయంలో రాత్రి 8.20 గంటలకు మళ్లీ శిల్పా మోహన్ రెడ్డి.. చక్రపాణి రెడ్డి నివాసానికి వచ్చారు. గంటకు ఉన్నారు. దీంతో వైసిపిలో చక్రపాణి రెడ్డి చేరిక ఖాయమని తేలింది. అందుకు అనుగుణంగా ఆయన బుధవారం నంద్యాల నుంచి హైదరాబాద్ బయలుదేరారు. వైయస్ జగన్‌ను కలుస్తారు. రేపు (గురువారం) జగన్ పర్యనలో ఆయన వైసిపి తీర్థం పుచ్చుకోనున్నారు.

English summary
YSR Congress Nandyal bypoll candidate Silpa Mohan Reddy on Tuesday met brother and TDP MLC Silpa Chakrapani Reddy for support in by elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X