వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు..?జ‌గ‌న్ ఆ నిర్ణ‌యం తీసుకోగ‌ల‌రా.. రాష్ట్ర ప్ర‌జ‌ల అయిదేళ్ళ నిరీక్ష‌ణ

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న జ‌రిగి అయిదేళ్ళు పూర్త‌యింది. 23 జిల్లాలుగా ఉన్న ఏపీ ప‌ది జిల్లాల‌తో తెలంగాణ‌..13 జిల్లాల‌తో ఏపీ ఏర్పాటైంది. అధికారికంగా 2014, జూన్ 2న విభ‌జ‌న పూర్త‌యింది. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన త‌రువాత ఏపీలో ఏర్ప‌డిన టీడీపీ ప్ర‌భుత్వం ప్ర‌తీ ఏటా జూన్ 2న న‌వనిర్మాణ దీక్ష పేరుతో వారం రోజుల పాటు కార్య‌క్ర‌మాలు నిర్వహించింది. ఒక వైపు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌లు జ‌రుపుకుంటోంది. కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గ‌త ప్ర‌భుత్వం విభ‌జ‌న క‌సి కొన‌సాగాలి అంటూ దీక్ష‌ల‌కే ప‌రిమితం అయింది. అయితే...విభ‌జ‌న త‌రువాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ అయిదేళ్లు రాష్ట్ర అవ‌త‌ర ణ దినోత్స‌వం జరుపుకోలేదు. దేశంలో ఏ రాష్ట్రం ఇలాంటి ప‌రిస్థితుల్లో లేదు. మ‌రి..ఇప్పుడు జ‌గ‌న్ ఏం చేస్తారు..

ఏపీ అవ‌త‌ర‌ణ దినోత్స‌వం ఎప్పుడు..
ఆంధ్ర రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం అక్టోబ‌ర్ 1న జ‌రుపుకున్నారు. 23 జిల్లాల ఆంధ్ర‌ప్ర‌దేవ్ అవ‌త‌ర‌ణ దినోత్స‌వం న‌వంబ‌ర్ 1న జ‌ర‌పుకున్నాం. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం జూన్ 2న జ‌రుపుకుంటు న్నారు. మ‌రి..ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అవ‌త‌ర‌ణ దినోత్స‌వం ఉండ‌దా. పాల‌కుల‌కు ఈ విష‌యం ప‌ట్ట‌దా. ముఖ్య‌మంత్రులుగా ఉన్న వారు తమ జ‌న్మ‌దినాల‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. అయిదున్నార కోట్ల మంది ప్ర‌జ‌లు ఉన్న రాష్ట్రంకు ఆవిర్భావ దినోత్స‌వం లేక‌ప‌పోవ‌టం పైనా రాష్ట్ర వ్యాప్తంగా చాలా కాలంగా చ‌ర్చ సాగుతోంది.

Since five years AP not conducting state formation day after bifurcation. Now public expecting new govt decision

రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన త‌రువాత ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ జూన్ 2న ఏపీ ప్ర‌జ‌ల్లో విభ‌జ‌న క‌సి పెంచాల‌నే ఓ నినాదంతో ప్ర‌తీ ఏటా అదే రోజున న‌వ నిర్మాణ దీక్ష పేరుతో దీక్ష‌లు..వారం రోజుల పాటు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేది. విభ‌జ‌న గాయం ఏపీ ప్ర‌జ‌ల్లో మాన‌క‌పోయినా..ఏపీకీ ఆత్మ‌గౌర‌వానికి సంబంధించి అవ‌త‌ర‌ణ దినోత్స‌వం పై మాత్రం నిర్ణ‌యం లేదు.

జ‌గ‌న్ ఆ నిర్ణ‌యం తీసుకోగ‌ల‌రా..
ఇక‌, ఇప్పుడు ఏపీలో ప్ర‌భుత్వం మారింది. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యారు. ఏపీ ప్ర‌జ‌ల కోరిక మేర‌కు జ‌గ‌న్ అయినా ఏపీకీ అవ‌త‌ర‌ణ దినోత్స‌వం ఖ‌రారు దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటారా లేదా అనే చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో చంద్ర బాబు ప్ర‌భుత్వం కేంద్రానికి దీని పైన లేఖ రాసింది. ఏపీ ప్ర‌భుత్వం ఎప్పుడు అవ‌త‌ర‌ణ దినోత్స‌వం జ‌రుపుకోవాలో స్ప‌ష్ట‌త ఇవ్వాలంటూ కోరింది. దీనికి స్పంద‌న‌గా..విడిపోయింది తెలంగాణ కాబ‌ట్టి..పాత పేరు ఆంధ్ర‌ప్ర‌దేశ్ పేరు అదే విధంగా ఉండ‌టంతో అక్టోబ‌ర్ 1న జ‌రుపుకోవాల‌ని సూచించింది.

అయితే, నాటి రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన జూన్ 8న రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వ నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి కోర‌గా..కేంద్రం స్పందించ‌లేదు.ఆ త‌రువాత రాజ‌కీయంగా భావోద్వేగాలు కొన‌సాగించ‌టానికి దీక్ష‌లు మొద‌లు పెట్టారు. మ‌రి, ఇప్పుడు జ‌గ‌న్ అయినా ఈ విష‌యంలో కేంద్రంతో సంప్ర‌దింపులు జ‌రిపి ఏపీకి అవ‌త‌ర‌ణ దినోత్స‌వం ఖ‌రారు చేయాల‌ని అనేక మంది కోరుతున్నారు.

English summary
Since five years AP not conducting state formation day after bifurcation. Now public expecting new govt may take action in this State formation day decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X