వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆదివారం కలసి రాని బోటు ప్రయాణం..30 ఏళ్లలో 100 మందికి పైగా మృత్యువాత..!!

|
Google Oneindia TeluguNews

కారణాలు ఏవైనా గోదావరి ప్రయాణం అనేక సందర్భాల్లో అనేక మంది ప్రాణాలు పోవటానికి కారణమైంది. తూర్పు గోదావరి జిల్లా కేంద్రంగా చోటు చేసుకున్న ఘటనలు ఎంతో మంది ప్రాణాలు పోవటానికి కారణ మయ్యాయి. గత 30 ఏళ్ల కాలంలో వంద మందికి పైగా బోటు ప్రమాణదాల్లో ప్రాణాలు వదలాల్సి వచ్చింది. ఘటన జరిగిన సమయంలో ప్రభుత్వం..అధికారులు హడావుడి చేయటం.. తాత్కాలక ఉపశమన చర్యల తో మభ్య పెట్టటం వరకు మాత్రమే పరిమితం అవుతోంది. ఇక..బోటు ప్రమాదాలు ఆదివారం నాడే చోటు చేసుకుంటున్నాయి.

పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో బోటు తిరగబడిన ఘటన, తాజాగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో జరిగిన బోటు ప్రమాదం రెండూ ఆదివారమే జరగడం ఇప్పుడు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. అయితే..దేవీపట్నం వద్ద తాజాగా జరిగిన ప్రమాదం మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగానే కనిపిస్తోంది. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన పర్యాటకులకు అవగాహన లేకపోయినా..బోటు ఆపరేటర్లకు..అక్కడి అధికారులు మాత్రం స్పష్టత ఉంది. అయినా..బోటును నిరోధంచటంలో విఫలమయ్యారు. ఫలితంగా భారీ నష్టం జరిగిపోయింది.

పోలీసులు అడ్డుపడ్డారు: ఉన్నతాధికారి పేరుతో ముందుకు: బోటు ప్రమాదానికి ముందు ఏం జరిగింది..!!పోలీసులు అడ్డుపడ్డారు: ఉన్నతాధికారి పేరుతో ముందుకు: బోటు ప్రమాదానికి ముందు ఏం జరిగింది..!!

since last 30 years above 100 people lost thier lives in boat jounrney in Godavari

30 ఏళ్ళల్లో 100 మందికి పైగా గోదావరి నీట...
తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదిలో చోటు చేసుకుంటున్న పడవ ప్రమాదాల్లో గత 30 ఏళ్ల కాలంలో దాదాపు 100 మందికి పైనగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందులో ప్రధానంగా జరిగిన ఘటనలు.

  • 1985లో.. వీఆర్‌ పురం మండలం శ్రీరామగిరిలోని శ్రీరామ నవమి కల్యాణాన్ని వీక్షించేందుకు సుమారు 50 మందితో వెళ్లిన బోటు ప్రమాదానికి గురై 40 మంది మృతిచెందారు. 1990లో.. ఆత్రేయపురం మండల పరిధిలోని ఒద్దిపర్రు, వెలిచేరు, పేరవరం గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే లంకరేవులో పడవ మునిగి పది మంది చనిపోయారు.
  • 1992లో.. ఐ.పోలవరం మండలం పరిధిలోని గోగుళ్లంక-భైరవలంక మధ్య చింతేరుపాయ వద్ద పడవ బోల్తా పడి ముగ్గురు ఉపాధ్యాయులు మరణించారు.
  • 1996లో బోడసకుర్రు-పాశర్లపూడి మధ్య వైనతేయ నదీ పాయపై పడవ దాటుతుండగా బలమైన గాలులకు పడవ బోల్తా పడి పదిమంది వరకు కూలీలు చనిపోయారు.
  • 2004లో.. యానాం-ఎదుర్లంక వారధి నిర్మించక ముందు గౌతమీ గోదావరి నదీ పాయపై జరిగిన పలు పడవ ప్రమాదాల్లో 10మంది వరకు మృతిచెందారు.
  • 2007లో ఓడలరేవు-కరవాక రేవు మధ్య ప్రయాణికులతో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురైంది. ఇంజన్ చెడిపోవడంతో గాలికి సముద్రం వైపు కొట్టుకుపోతుండగా మరో పడవ ద్వారా అందులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
  • 2008లో రాజమహేంద్రవరానికి చెందిన న్యాయవాదులు పాపికొండల విహారయాత్రకు వెళ్తూ పడవ ప్రమాదానికి గురై ఇద్దరు మృతిచెందారు.
  • 2009లో.. అంతర్వేది-బియ్యపు తిప్ప మధ్యలో వశిష్ట సాగర సంగమం సమీపంలో ప్రయాణం చేస్తుండగా పడవ మునిగి పశ్చిమ గోదావరికి చెందిన ముగ్గురు బలయ్యారు.
  • 2018లో.. మే 15న మంటూరు వద్ద 50 మందితో వెళ్తున్న లాంచీ బోల్తాపడిన ఘటనలో 19 మంది జలసమాధి అయ్యారు. మృతదేహాలను వెలికితీయడానికి మూడ్రోజులు శ్రమించాల్సి వచ్చింది.
  • 2018 జులైలో.. ఐ.పోలవరం మండలం పశువుల్లంకవద్ద పడవ బోల్తా ఘటనలో ఏడుగురు మరణించారు. ఇందులో ముగ్గురి మృతదేహాలు ఇప్పటివరకు లభించలేదు.

కాగా, అప్పట్లోనే 120మంది ప్రయాణికులతో వెళ్తున్న పర్యాటక బోటు అగ్నిప్రమాదానికి గురైంది. డ్రైవర్‌ అప్రమత్తమై బోటును సమయస్ఫూర్తితో ఒడ్డుకు చేర్చడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. తాజాగా ఆదివారం దేవీపట్నం మండలం కచ్చలూరులో సంభవించిన దుర్ఘటన ఇప్పుడు జరిగినది మూడో ప్రమాదం.

since last 30 years above 100 people lost thier lives in boat jounrney in Godavari

అదివారం కలిసి రాని బోటు ప్రయాణం..
రెండేళ్ల క్రితం విజయవాడ సమీపంలో జరిగిన బోటు ప్రమాదం సైతం ఆదివారం రోజునే జరగింది. 2017 నవంబర్‌ 12న విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో బోటు తిరగబడిన ఘటన, తాజాగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో జరిగిన బోటు ప్రమాదం రెండూ ఆదివారమే జరిగాయి. కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన భక్తులు విజయవాడ కృష్ణానదిలో బోటులో విహారానికి వెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 22 మంది జలసమాధి అయ్యారు. శనిఆదివారాలు సెలవులు కావ డంతో తెలంగాణ, ఏపీకి చెందిన అనేక మంది పాపికొండల యాత్రకు వచ్చారు. ఈ ప్రమాదంలో భారీ నష్టం జరిగింది. అయితే రెండు ప్రమాదాల్లోనూ అధికారులు..సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించాయి. ఇప్పుడు తాజా ఘటన మీద ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చూడాలి.

English summary
since last 30 years above 100 people lost thier lives in boat jounrney in Godavari. Recently krishna river and latest Godavari tragedy taken place in sunday. Govt intiate to take take action against local tourism staff.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X