అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ఇక లేనట్లే: ఏపీ ప్రభుత్వ నిర్ణయం: సింగపూర్ ప్రభుత్వం సైతం అంగీకారం..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి సింగపూర్ ప్రభుత్వం సైతం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పరస్పర అంగీకారం మేరకు సింగపూర్ కన్సార్షియమ్- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రకటన విడుదల చేసారు. సింగపూర్ కన్సార్షియమ్ లోని అసెండస్ సింగ్ బ్రిడ్జ్- సెంబు కార్పె కార్పొరేషన్ ను ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగినట్టు ఆ ప్రకటనలో స్పష్టం చేసారు. అమరావతి లోని 6.84 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేసే లక్ష్యం తో స్టార్టప్ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టామని.. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన్యాల వల్ల దీన్ని చేపట్టకూడని నిర్ణయం తీసుకున్న మేరకు ప్రాజెక్టును నిలిపి వేస్తున్నట్టు సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ స్పష్టం చేసింది. దీంతో..ఇక అమరావతిలో సింగపూర్ ఒప్పందాలు అమల్లో లేనట్లే.

YS Jagan Mohan Reddy: ఇంగ్లీష్ మీడియంపై విమర్శల మధ్య..తెలుగులో జీవోను విడుదల చేసిన ఏపీ సర్కార్YS Jagan Mohan Reddy: ఇంగ్లీష్ మీడియంపై విమర్శల మధ్య..తెలుగులో జీవోను విడుదల చేసిన ఏపీ సర్కార్

ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు..
రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి స్విస్ చాలెంజ్ విధానంలో అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ), సింగపూర్ కన్సార్టియంతో కలిసి ఉమ్మడి భాగస్వామ్యంలో అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్స్ సంస్థను ఏర్పాటు చేశారు. రాజధానిలోని 6.84 చదరపు కిలోమీటర్లను స్టార్టప్ ఏరియాగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. పీపీపీ విధానంలో స్టార్టప్ ఏరియాను సింగపూర్ అమరావతి ఇనె్వస్టుమెంట్ హోల్డింగ్స్ ద్వారా నిర్వహించేందుకు ఏపీసీఆర్‌డీఏ ఒప్పందం కుదుర్చుకుంది. స్టార్టప్ ఏరియా కింద 1691 ఎకరాల్లో దాదాపు 460 ఎకరాల్లో సదుపాయాలు కల్పిస్తారు. మిగిలిన 1230 ఎకరాలను మూడు దశల్లో విక్రయించేందుకు ప్రతిపాదించారు. దీనికి సంబంధించి అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్స్ పేరున జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వకపోవడంతో ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియంతో చర్చలు జరిపింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది.

singapore govt also agreed AP govt decision on Startup area development in Amravati

సీఆర్డీఏ నివేదిక మేరకు..
స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధి కోసం ఏడీసీఎల్‌ - సింగపూర్‌ కన్సార్షియంలు సంయుక్త భాగస్వాములుగా ఏర్పాటు చేసిన జేపీవీ.. ఏడీపీ (అమరావతి డవల్‌పమెంట్‌ పార్టనర్‌)ను కూడా రద్దు చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి కోసం ఒప్పందం కుదుర్చుకుని 17 నెలలు దాటినప్పటికి ప్రాజెక్టు పనుల్లో ఏ మాత్రం పురోగతి లేదని, ఫలితంగా దాని వల్ల అమరావతికి లభిస్తుందని ఆశించిన ప్రయోజనం నెరవేరలేదని ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌ ఇచ్చిన నివేదికను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్ట చేసింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సింగపూర్ సైతం ఆమోదించటంతో ఇక ఈ వ్యవహారానికి ముగింపు పలికినట్టే.

English summary
singapur govt also agreed AP govt decison on withdraw the agreement on Start up area development in Amaravti. Recently AP govt taken this decision. Now, singapur govt given orders in same way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X