ఎపి రాజధానికి సింగపూర్ సాయం: మంత్రి నారాయణ

మంత్రి నారాయణ సింగపూర్ ప్రభుత్వ అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అన్ని వసతులు ఒకే చోట ఉండేలా నిర్మాణం చేయాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రాథమికంగా రాజధానిలో నిర్మాణాలు, ప్రణాళికలు ఏ రకంగా ఉండాలనే నమూనాలను కూడా మంత్రి పరిశీలించారు. ప్రపంచ స్థాయి వసతులతో రానున్న వందేళ్ల పాటు అవసరాలకు సరిపడే విధంగా రాజధానిలో నిర్మాణాలు ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశమని నారాయణ చెప్పారు.
ఈ సాయంత్రం సింగపూర్ బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమవుతుందని ఆయన చెప్పారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం నగరాలను మెగాసిటీలుగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications