అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు, నేను చాలాసార్లు చర్చించుకున్నాం, మీరు అక్కడకు రండి: సింగపూర్ మంత్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై తాను, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చాలాసార్లు చర్చించుకున్నామని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ గురువారం అన్నారు. ఇరువురు మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడిన తర్వాత ఈశ్వరన్ మాట్లాడారు. ఒప్పందంలో భాగంగా వెల్కమ్ సెంటర్ త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. మేము కూడా విజయవాడలో ఓ స్థానిక కార్యాలయం ఏర్పాటు చేశామని చెప్పారు.

నేను చెప్పినట్లు అతిపెద్ద స్కాం బయటకొస్తుంది, పవన్ కళ్యాణ్‌ను చూసి నేర్చారు: కుటుంబరావునేను చెప్పినట్లు అతిపెద్ద స్కాం బయటకొస్తుంది, పవన్ కళ్యాణ్‌ను చూసి నేర్చారు: కుటుంబరావు

వరల్డ్ సిటీ సమ్మిట్‌కు రావాలని ఏపీ బృందాన్ని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అమరావతి నిర్మాణంలో ప్రజలు భాగస్వామ్యం వహించాలని విజ్ఞప్తి చేశారు. కొంతమంది రైతులు సింగపూర్ వచ్చారని చెప్పారు. అలాగే మా దేశం నుంచి కొంతమంది పౌరులు ఇక్కడకు వచ్చారని చెప్పారు. అమరావతి నగర నిర్మాణానికి సంబంధించి ప్రణాళికలు వేశారని ఈశ్వరన్ చెప్పారు.

Singapore Minister Iswaran welcomes AP government to World City Summit

అభివృద్ధికి విస్తృతస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. రైతుల సింగపూర్ యాత్ర వారిలో ఆత్మవిశ్వాసం పెంచిందని చెప్పారు. అంతకుముుందు చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రాజెక్టుకును మూడు దశల్లో 15 ఏళ్లలో నిర్మించేలా ఉంటుందన్నారు. ఇవాళ్టి నుంచే ఫ్జ్ జీరో నిర్మాణానికి పునాది పడుతుందన్నారు. ఎన్నికల సమయంలోనే తాము సింగపూర్ వంటి రాజధాని అని చెప్పామని గుర్తు చేశారు. సింగపూర్ అమరావతికి డైరెక్ట్ ఎయిర్ కనెక్టివిటీ ఉండనుందని చెప్పారు.

శుభవార్తే

జులైలో విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సేవలు ప్రారంభం కావడం నవ్యాంధ్ర ప్రజలకు శుభవార్తే. రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా సింగపూర్-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న మూడో అత్యున్నత సమావేశాల్లో పాల్గొనేందుకు సింగపూర్ సమాచార శాఖ మంత్రి ఈశ్వరన్ గురువారం ఉదయం విజయవాడ రాగా, పలు ఒప్పందాలు కుదిరిన విషయం తెలిసిందే.

English summary
Singapore Minister Iswaran welcome to Andhra Pradesh Government to World City Summit which will held in Singapore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X