అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి ఒప్పందం రద్దు దిశగా : నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం: ఆ దేశ మంత్రి కీలక వ్యాఖ్యలు..!!

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధాని అమరావతిలో సింగపూర్ కన్సార్షియంతో చేసుకున్న ఒప్పందాలు రద్దు అవుతున్నాయా. ఇక..అమరావతిలో స్టార్టప్ ఏరియా డెవపల్ మెంట్ ప్రాజెక్టను సైతం సింగపూర్ వదులుకున్నట్లేనా. తాజాగా ఆ దేశ మంత్రి వ్యాఖ్యలు ఏపీతో దూరంగా ఉండాలనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాజధానిగా అమరావతి ప్రకటన చేసిన సమయం నుండి అన్నింటా అమరావతి కంపెనీలు కీలక పాత్ర పోషించాయి. రాజధాని ప్రణాళికలతో పాటుగా కేపిటల్ సిటీగా స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేసారు. అయితే, ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారటంతో పాటుగా రాజధాని మీద సమీక్ష చేయాలని భావిస్తున్న వేళ.. సింగపూర్ మంత్రి అధికారికంగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు సింగపూర్ పైన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో..ఇప్పుడు ప్రభుత్వ స్పందన ఏంటనేది ఆసక్తి కరంగా ఉంది.

ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే..
అమరావతి రాజధాని గురించి సింగపూర్ ఆర్ధిక మంత్రి వీవీఎస్ బాలకృష్ణన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో అమరావతి మీద జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నామని చెప్పుకొచ్చారు. రాజధాని ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం సమీక్ష చేయాలని భావిస్తోందని.. ఈ విషయాన్ని సింగపూర్ కన్సార్షియం తమకు తెలిపిందని చెప్పుకొచ్చారు. ప్రకటించారు. సమీక్ష చేసుకునే అధికారం రాష్ట్ర సర్కారుకు ఉందని, దాని ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని బాలకృష్ణన్ చెప్పారు. ఈ ప్రకటన ద్వారా తాము ముందుకు వెళ్తుందీ లేనది మంత్రి స్పష్టం చేయకపోయినా.. గత మూడు నెలల కాలంగా మాత్రం సింగపూర్ కన్సార్షియం అమరావతి మీద అంతగా శ్రద్ద చూపటం లేదు. ప్రస్తుతానికి అమరావతిలో నిర్మాణాలు నిలిచిపోయాయి. అదే విధంగా గతంలో చేసిన ఒప్పందాలకు బ్యాంకు గ్యారంటీలు లేవని తాజాగా మంత్రి బొత్సా చెప్పుకొచ్చారు. వీటన్నింటినీ రద్దు చేస్తామని స్పష్టం చేసారు. అయితే.. స్టార్టప్ ఏరియా గురించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సింగపూర్ తో గతం లో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తారా.. కొనసాగిస్తారా అనే దాని మీద ఇప్పుడు స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది.

Singapore minister key comments on Govt decision on Review of Amaravati

సింగపూర్ లో మంత్రి బుగ్గన..
ఏపీ ఆర్దిక మంత్రి బుగ్గన సింగపూర్ లో పర్యటిస్తున్నారు. ఆయన అధికారిక పర్యటనలో భాగంగానే అక్కడ పర్యటన కోసం వెళ్లారు. ఈ సమయంలో సింగపూర్ మంత్రి రాజధాని రివ్యూ గురించి వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఎక్కడా ఏపీ ప్రభుత్వాన్ని ఆయన ఆక్షేపించలేదు. సమీక్షించే అధికారం ఏపీ ప్రభుత్వానికి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక, ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణాల మీద మరో నాలుగు రోజుల్లో కీలక నిర్ణయం ప్రకటిస్తారని ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రాజధాని ఒప్పందాలు..నిర్మాణల మీద ఫోకస్ చేసింది. ఆ నివేదిక ఈ వారంలోనే సమర్పించే అవకాశం ఉంది. ఆ తరువాతనే రాజధాని వ్యవహారం మీద ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. అయితే, ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం ఎక్కడా సింగపూర్ ప్రభుత్వంతో రాజధాని విషయంలో తమ భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉంటాయనే విషయం పైన మాత్రం ఇప్పటి వరకు స్ఫష్టత ఇవ్వలేదు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

English summary
Singapur minister key comments on Govt decision on Review of Amaravati.He says Ap Govt can review capital projects. After Govt decision Tehy will take appropriate steps on This matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X