వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫారం-7 ఎవ‌రైనా ఇవ్వ‌చ్చు : ఆ త‌రువాత ఒక్క ఓటు తొలిగించ‌లేదు : సీఈవో ద్వివేదీ..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో సాగుతున్న ఫారం-7 ర‌చ్చ‌కు ఏపి ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ముగింపు ప‌లికే ప్ర‌య‌త్నం చేసారు. ఫారం-7 అనేది ద‌ర‌ఖాస్తు మాత్ర‌మే అని..ద‌ర‌ఖాస్తు వ‌స్తే ఓటు తొలిగించిన‌ట్లు కాద‌ని తేల్చి చెప్పారు. రాజ‌కీయ నేత‌లు ప్ర‌జ‌ల‌ను గంద ర‌గోళ ప‌ర‌చ‌టం స‌రి కాద‌న్నారు. జ‌న‌వ‌రి 11 త‌రువాత ఒక్క ఓటు కూడా తొలిగించ‌లేద‌ని స్ప‌ష్టం చేసారు.

<strong>వార్ బిగిన్స్‌: తెలంగాణ పోలీసులు డేటా దొంగిలించారు : టిడిపి నేత‌ల ఫిర్యాదు..!</strong>వార్ బిగిన్స్‌: తెలంగాణ పోలీసులు డేటా దొంగిలించారు : టిడిపి నేత‌ల ఫిర్యాదు..!

ఫారం -7 దాఖ‌లు త‌ప్పు కాదు..
ఫారం -7 దాఖ‌లు తప్పు కాద‌ని రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ద్వివేది స్ప‌ష్టం చేసారు. ద్వివేది మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఫారం-7 అనేది దరఖాస్తు మాత్రమేనన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే ఓటు తొలగించినట్లు కాదని తెలిపారు. పోలీస్‌ కేసులు మొదలుకాగానే నకిలీ దరఖాస్తులు ఆగిపోయాయన్నారు. ఓట్ల తొలగింపు వ్యవహారంలో పార్టీల వైఖరిని ఆయన తప్పుపట్టారు. ప్రజల్ని గందరగోళానికి గురిచేసే ప్రకటనలు సరికాదని హితవుపలికారు. ఓట్లు ఎక్కడ తొలగించారో నిరూపించాలని సవాల్ విసిరారు. ఏపీలో జనాభా కంటే ఓటరు నిష్పత్తి తక్కువగా ఉందని వెల్లడించారు. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని వివరణ ఇచ్చారు.

Single Vote not deleted after january 11th : CEO Dwivedi Clarified the Form-7 dispute

ఆ త‌రువాత ఒక్క ఓటు తొలిగించ‌లేదు..
జనవరి 11 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఓటు కూడా తొలగించలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది స్ప ష్టం చేశారు. ఫారం- 7 వ‌స్తే దాని పై విచార‌ణ చేస్తున్నామ‌న్నారు. ఇప్ప‌టి దాకా మొత్తం 10వేల ఓట్లు తొలిగించామ‌ని చెప్పారు. ఇప్పటి వ‌ర‌కు మొత్తంగా ఫారం -7 తమ వ‌ద్ద‌కు 8.76 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని చెప్పారు. అందులో 161005 పారం-7 ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న చేసామ‌న్నారు. అందులో, 5309 మాత్ర‌మే అసలైన‌వి గా గుర్తించామ‌ని చెప్పుకొ చ్చారు. 155696 డూప్లి కేట్ గా గుర్తించామ‌ని ప్ర‌క‌టించారు. దీని కోసం ప్ర‌స్తుతం 45 వేల సిబ్బంది ప‌ని చేస్తున్నా ర‌ని.. నాలుగైదు రోజుల్లో ఈ ద‌ర ఖాస్తుల ప‌రిశీల‌న పూర్తి అవుతుంద‌ని వెల్ల‌డించారు.

English summary
AP CEO Dwivedi clarified that Form-7 can give any body. With online Form-7 applications no vote will be deleted by list. Up to now 8.76 Lakhs applications recieved and in that 5309 applications is only in proper way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X