వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరావతి భూముల స్కాంలో సిట్ దర్యాప్తు ముమ్మరం- తుళ్లూరు మాజీ తహసీల్దార్, మరొకరు అరెస్ట్...

|
Google Oneindia TeluguNews

ఇన్ సైడర్ ట్రేడింగ్ రూపంలో సాగిన అమరావతి భూ కుంభకోణంలో ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ బృందం దర్యాప్తు చాపకింద నీరులా సాగిపోతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రభుత్వ అధికారులను, మధ్యవర్తులను అరెస్ట్ చేసిన సిట్ బృందం ఇవాళ అక్రమాలకు పాల్పడిన మరో ఇద్దరిని అరెస్టు చేసింది. ఇందులో తుళ్లూరు మాజీ తహసీల్దార్ తో పాటు భూములు కొన్న మరో వ్యక్తి కూడా ఉన్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తుళ్లూరు కేంద్రంగా సాగిన రాజధాని భూముల స్కాంలో సిట్ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఈ కేసులో పక్కా ఆధారాలతో ముందుకెళ్తున్న సిట్ అధికారులు.. ఇవాళ మాజీ తహసీల్దార్ అన్నే సుధీర్ బాబుతో పాటు భూములు కొన్న గుమ్మడి సురేష్ ను అరెస్టు చేశారు. టీడీపీ నేతలతో కుమ్మక్కై సుధీర్ బాబు రికార్డులను తారుమారు చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తుళ్లూరులో సాగిన భూ అక్రమాల్లో వీరిద్దరి పాత్ర ఉందని నిర్ధారణకు వచ్చిన సిట్ వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా తుళ్లూరు పరిధిలో జరిగిన అక్రమాలపై ఎక్కువగా దృష్టిపెట్టిన సిట్.. వీరిని అదుపులోకి తీసుకోవడంతో మరిన్ని ఆధారాలు లభించవచ్చని భావిస్తున్నారు.

sit arrests former thullur tahasildar and one more accused in amaravati land scam

Recommended Video

AP Cabinet Meet : కొత్త జిల్లాల‌ ఏర్పాటు కోసం కమిటీ.. మహిళలకు 75000

ఇప్పటికే సిట్ దర్యాప్తు ఆధారంగా సీఐడీ, ఈడీ కూడా ముందుకు సాగుతున్న నేపథ్యంలో సిట్ పోలీసుల అడుగులు ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా రాజధానికి ముఖ్య కేంద్రంగా అప్పట్లో ప్రచారం సాగిన తుళ్లూరు పరిధిలో టీడీపీ నేతలు స్ధానిక రైతుల అసైన్డ్ భూములను వదలకుండా ఒత్తిళ్లు తెచ్చి క్రయవిక్రయాలు చేపట్టారని సిట్ భావిస్తోంది. అందుకే ఇక్కడ తీగ లాగితే ఎక్కడో డొంక కదిలే అవకాశాలున్నట్లు సిట్ అంచనా వేస్తోంది.

English summary
andhra pradesh government appointed special investigation team on amarvati lands scam arrested two key accused today. one of these is a land buyer and another is former tahasildar of thullur anne sudheer babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X