కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివేకా హ‌త్య : ఎలాంటి వారో జ‌గ‌న్ కు తెలుసు : అవినాశ్ విచార‌ణ‌:స‌ంబంధం లేదు: ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి..

|
Google Oneindia TeluguNews

వివేకానంద‌రెడ్డి హత్య కేసులో విచార‌ణ వేగ‌వ‌తంతం అయింది. వివేకా హ‌త్య త‌రువాత క‌నిపించ‌కుండా పోయిన ఆయ‌న స‌న్నిహితుడు పై అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. ఆయ‌న ఓ అస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. 30 ఏళ్లుగా వివేకా తో సన్నిహితంగా ఉంటున్నామ‌ని..హ‌త్య‌తో సంబంధం లేద‌ని తేల్చి చెప్పారు.

ఆ లెట‌ర్ రాసింది వివేకానే, చేతిరాత ఆయ‌నదేః ధృవీక‌రించిన క‌డ‌ప ఎస్పీఆ లెట‌ర్ రాసింది వివేకానే, చేతిరాత ఆయ‌నదేః ధృవీక‌రించిన క‌డ‌ప ఎస్పీ

హ‌త్య తో సంబంధం లేదు..

హ‌త్య తో సంబంధం లేదు..

రెండు రోజులుగా వివేకానంద హ‌త్య కేసులో ప‌ర‌మేశ్వ రెడ్డి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఆయ‌న‌కు ఈ హ‌త్య తో సంబంధాలు ఉన్నాయ‌నే కోణంలో విచార‌ణ సాగుతోంది. అయితే, పరమేశ్వర్‌రెడ్డి తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పులివెందుల సమీపంలోని కసనూరుకు చెందిన పరమేశ్వర్‌రెడ్డి సెటిల్‌మెంట్లు, భూ వివాదా లు పరిష్కరించేవాడని, వివేకాతో అత్యంత సన్నిహితంగా మెలిగేవాడని, ఇటీవల ఓ వివాదంలో పరమేశ్వర్‌తో వివేకా గొడవపడ్డాడని, వివేకా హత్యకు పది రోజుల ముందు త్వరలో ఓ సంచలనం చూస్తారంటూ పరమేశ్వర్‌ కొందరి వద్ద మాట్లాడాడని ప్రచారం జరిగింది. వివేకానందరెడ్డితో తనకు 30 ఏళ్లుగా పరిచయం ఉందని పరమేశ్వర్‌రెడ్డి తెలిపారు. తనకు ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చేరానని, వివేకా హత్యతో తనకు సంబంధం లేదని చెప్పారు.

ఎవ‌రు ఎలాంటి వారో జ‌గ‌న్ కు తెలుసు

ఎవ‌రు ఎలాంటి వారో జ‌గ‌న్ కు తెలుసు

త‌న భ‌ర్త పై వ‌స్తున్న అనుమానాల పై పరమేశ్వర్‌రెడ్డి భార్య సుభాషిణి స్పందించారు. వివేకా హత్యతో త‌న భర్తకు ఎ లాంటి సంబంధం లేదన్నారు. 30 ఏళ్లుగా వాళ్ల కోసమే పనిచేస్తున్నామ‌ని... కావాలనే మాపైన పుకార్లు పుట్టించారని చె ప్పుకొచ్చారు. ఎవరు ఎలాంటి వారో జగన్‌సార్‌కు తెలుసన్నారు. త‌న‌ భర్త ఆ పని చేశాడని తేలితే వాళ్ల ఆఫీసు ముందు నా గొంతు కోసుకుంటా అని వ్యాఖ్యానించారు. పోలీసులు వచ్చి అడిగారని, ఇంటి దొంగలే చేశారు. తేల్చుకోండి అని చెప్పామని ఆమె అన్నారు. తన భర్తకు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లామని, మెరుగైన చికిత్స కోసం తిరుపతికి వచ్చామని సుభాషిణి చెప్పుకొచ్చారు.

అవినాశ్ తో పాటుగా కుటుంబ స‌భ్యులు

అవినాశ్ తో పాటుగా కుటుంబ స‌భ్యులు

వివేకా హ‌త్య కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు 20 మంది సాక్షులను విచారించారు. ఏ అంశాన్నీ వదలకుండా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పులివెందుల పోలీసుస్టేషన్‌కు వివేకా దగ్గరి బంధువులు ఆరుగురిని పిలిపించి విచారణ జరిపి వారి నుం చి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. అవినాష్ రెడ్డిని హ‌త్య ఘ‌ట‌న లో చోటు చేసుకున్న ప‌రిణామాల పై ఆరా తీసి న‌ట్లు స‌మాచారం. వివేకా సోదరులు భాస్కర్‌రెడ్డి,మనోహర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, వివేకా బావమరిది శివప్రకాష్ రెడ్డి, జగన్ అనుచ రుడు శంకర్‌రెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. దీని పై ఒక‌టి రెండు రోజుల్లో చిక్కుముడి విప్పుతామ‌ని పోలీసులు చెబు తున్నారు.

English summary
In YS Vivekananda Murder case police interagating YS Viveka Family members. Parameswar Reddy who was close associa te with viveka is in hospital . He denied rumors on him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X