అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధాని భూ కుంభకోణం .. దర్యాప్తులో సిట్ దూకుడు .. ఆ ఉన్నతాధికారుల్లో వణుకు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఆర్డీఏ రీజియన్ లో భూలావాదేవీల్లో అక్రమాలు జరిగాయని అధికారం చేపట్టిన నాటి నుండి ఆరోపిస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ అక్రమాల నిగ్గు తేల్చే పనిలో సిట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే . రాజధాని అమరావతి భూముల కుంభకోణంలో అక్రమాల దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. టిడిపి హయాంలో జరిగిన ల్యాండ్ పూలింగ్ విషయంలో కుంభకోణం జరిగిందని నిర్ధారించిన సిట్ అప్పుడు ఇన్ఛార్జ్ లుగా పనిచేసిన డిప్యూటీ కలెక్టర్ లపై విచారణ చేపట్టింది.

Recommended Video

AP Capital Land కుంభకోణం investigation, SIT దూకుడు

ఏపీ ఎస్ఈబీ ఏర్పాటుపై రాజకీయ ప్రేరేపిత పిటీషన్ .. రివర్స్ లో పిటీషన్ వేసిన ఉద్యోగుల సమాఖ్యఏపీ ఎస్ఈబీ ఏర్పాటుపై రాజకీయ ప్రేరేపిత పిటీషన్ .. రివర్స్ లో పిటీషన్ వేసిన ఉద్యోగుల సమాఖ్య

 ల్యాండ్ పూలింగ్ లో అక్రమాలతో డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్ ..

ల్యాండ్ పూలింగ్ లో అక్రమాలతో డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్ ..

ఇటీవల నెక్కల్లు డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్ చేసిన పోలీసులు అమరావతి ల్యాండ్ పూలింగ్ లో అక్రమాలు చేసినట్టు, తప్పుడు రికార్డులు సృష్టించినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం మాధురి గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్నారు. తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామానికి చెందిన టిడిపి నేత రావుల గోపాలకృష్ణ తో కుమ్మకై అక్రమ మార్గంలో 3880 చదరపు గజాల 10 ప్లాట్లను కేటాయించడమే కాకుండా 5.26 లక్షల రూపాయల కౌలు కూడా చెల్లించారు. చేసిన అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకే తప్పుడు తేదీలతో నకిలీ రికార్డులు సృష్టించారని గుర్తించిన సిట్ అధికారులు డిప్యూటీ కలెక్టర్ మాధురిపై కేసు నమోదు చేశారు.

రాజధానిలో ప్రభుత్వ భూములు , కుంటలు , గ్రామ కంఠంభూములను వదలని అక్రమార్కులు

రాజధానిలో ప్రభుత్వ భూములు , కుంటలు , గ్రామ కంఠంభూములను వదలని అక్రమార్కులు

ఇక డిప్యూటీ కలెక్టర్ మాధురి మాత్రమే కాకుండా,మరికొంత మందిని కూడా అదుపులోకి తీసుకొని విచారించనుందని తెలుస్తుంది. రైతుల భూములు ఇచ్చేందుకు ఒప్పించిన వారికి బహుమానంగా స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. ఇక అంతే కాదు ప్రభుత్వ భూములు, అటవీ భూములు, కుంటలు, గ్రామ కంఠం భూములు సైతం వదలకుండా టిడిపి నేతలు,జిల్లాస్థాయి ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడ్డారని సిట్ దర్యాప్తు బృందం గుర్తించింది. మొత్తం 150 ఎకరాల భూ కుంభకోణం జరిగినట్లుగా ఇప్పటి వరకు గుర్తించారు.

ఆ అవినీతి అధికారుల గుండెల్లో దడ

ఆ అవినీతి అధికారుల గుండెల్లో దడ

టిడిపి నేతల అక్రమాలకు కొమ్ము కాసి, తప్పుడు రికార్డులు సృష్టించిన, అవినీతికి పాల్పడిన అధికారుల గుండెల్లో ఇటీవల డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్టుతో దడ మొదలైంది. అవసరం అనుకుంటే మరికొందరు డిప్యూటీ కలెక్టర్లను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలియడంతో ఉన్నతాధికారులలో వణుకు మొదలైంది. ఇక అంతే కాదుగ్రామ కంఠం భూముల అవకతవకల పైనా సిట్‌ నాజర్ పెట్టింది అప్పటి అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న కొందరి భూములను గ్రామ కంఠం పేరుతో వదిలేసి లబ్ది చేకూర్చిన అంశాలపై కూడా ఆరా తీస్తున్న సిట్‌ నిజానిజాల నిగ్గు తేల్చే పనిలో ఉంది.

English summary
SIT has been aggressive in its investigation of capital land grabs. During the period of TDP, investigated the deputy collectors who were in charge of land pooling. Already, the Deputy Collector Madhuri has been arrested and remanded. It is reported that Sit could be prosecuted by taking more people if needed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X