వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసుల అదుపులో వివేకా అనుచ‌రుడు : లేఖే కీల‌కం : సుధాక‌ర్ రెడ్డి తేల్చేసాడు..!

|
Google Oneindia TeluguNews

వైయ‌స్ వివేకానంద హ‌త్య కేసులో సిట్ విచార‌ణ వేగంతం చేసింది పులివెందు లో సిట్ అధికారులు హ‌త్య జ‌రిగిన ప్ర‌దే శం సంద‌ర్శించ‌టంతో పాటుగా ప్రాధమిక స‌మాచారం సేక‌రించారు. ఇక‌, వివేకా ప్ర‌ధాన అనుచ‌రుడిని అదుపులోకి తీసు కొని విచార‌ణ చేస్తున్నారు. మ‌రో న‌లుగురిని సిట్ అధికారులు విచారిస్తున్నారు.

గొడ్డలితో అతికిరాతంగా హత్యచేశారు...సీబీఐతో విచారణ జరిపించాలి: జగన్గొడ్డలితో అతికిరాతంగా హత్యచేశారు...సీబీఐతో విచారణ జరిపించాలి: జగన్

అదుపు లో వివేకా అనుచ‌రుడు..

అదుపు లో వివేకా అనుచ‌రుడు..

వివేకానంద హ‌త్య కేసు విచారిస్తున్న సిట్ బృందం కీల‌క అడుగులు వేస్తోంది. అందులో భాగంగా వివేకా ప్ర‌ధాన అనుచ రుడిగా ఉన్న ఎర్ర‌గంగారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశాన్ని సిట్ అధికారులు అమిత్ గార్గ్ తో పాటుగా అభిషేక్ మ‌హంతి ప‌రిశీలించారు. ఎర్ర గంగారెడ్డి నుండి అవ‌స‌ర‌మైన స‌మాచారం సేక‌రిస్తున్నారు. ఆయ‌న తో పాటుగా వివేకా హ‌త్య పై ఫిర్యాదు చేసిన వివేకానంద రెడ్డి పిఏ కృష్ణా రెడ్డిని విచారించారు. ఆయ‌న వివేకా ఇంటికి వ‌చ్చిన స‌మ‌యం నుండి హ‌త్య అని గుర్తించే దాకా చోటు చేసుకున్న ప‌రిణామాల పై ఆరా తీస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక‌, డ్రైవ‌ర్ ప్ర‌సాద్ తో పాటుగా ప‌నిమ‌నిషి లక్ష్మిని సిట్ అధికారులు విచారిస్తున్నారు.

 కీల‌కంగా మారిన లేఖ‌..

కీల‌కంగా మారిన లేఖ‌..

వివేకా త‌న పై డ్రైవ‌ర్ దాడి చేసాడంటూ రాసిన లేఖ ఇప్పుడు విచార‌ణ లో కీల‌కంగా మారుతోంది .దాడి స‌మ‌యంలో వివేకా ఎలా లేఖ రాయ‌గులుగుతార‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. వివేకా నివాసానికి జ‌గ‌న్ వ‌చ్చే కొద్ది సేప‌టి ముందు కుటుంబ స‌భ్యులు ఆ లేఖ ను పోలీసుల‌కు ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. అయితే, ఆ లేఖ పై ఇప్పుడు రాజీకీయంగా వివాదాలు చుట్టు ముడుతున్నాయి. సిట్ అధికారులు ఆ లేఖ‌ను సేక‌రించారు. వివేకా డైరీని ప‌రిశీలించి..అందులోని వివేకా చేతి రాత‌..లేఖ లోని ద‌స్తూరిని పోల్చి చూస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. దీంతో..వివేకా రాసిన‌ట్లుగా భావిస్తున్న లేఖ‌లో ప్ర‌స్తా వించిన డ్రైవ‌ర్ ఎపిసోడ్ ఇప్పుడు కీల‌కంగా మారుతోంది. అయితే, డ్రైవ‌ర్ భార్య మాత్రం త‌న భ‌ర్త‌కు ఈ హ‌త్య‌తో ఎటు వంటి సంబంధం లేద‌ని చెబుతున్నారు.

సుధాక‌ర్ రెడ్డి తేల్చేసాడు..

సుధాక‌ర్ రెడ్డి తేల్చేసాడు..

వివేకా హ‌త్య లో గ‌తంలో రాజారెడ్డి హ‌త్య లో జైలు జీవితం గ‌డిపి..కొద్ది రోజుల క్రిత‌మే స‌త్ప్ర‌వ‌ర్త‌న కార‌ణంతో బ‌య‌ట‌కు వ‌చ్చిన సుధాక‌ర్ రెడ్డి పై అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. దీంతో..పోలీసులు సుధాక‌ర్ రెడ్డిని విచారించిన‌ట్లు స‌మ‌చా రాం. త‌న‌కు ఎటువంటి సంబంధం లేద‌ని సుధాక‌ర్ రెడ్డి పోలీసుల విచార‌ణ లో చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో, అవ‌స‌ర‌మైతే మ‌రోసారి విచార‌ణ‌కు పిలుస్తామ‌ని చెప్పి పంపించేసారు. సిట్ లోని ఉన్న‌తాధికారులు వివేకా ఇంటికి వ‌చ్చి ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతాన్ని నిశితంగా ప‌రిశీలించారు. కొంత స‌మాచారం సేక‌రించారు. ఎన్నిక‌ల వేళ రాజ‌కీయం గా వివేకా హ‌త్య సంచ‌ల‌నంగా మారింది. దీంతో..పోలీసులు సైతం సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఈ కేసును చేధించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

English summary
SIT officers invetigating started in YS Viveka murder case. police officers taken Viveka main follower Ganga reddy into custody. Sit also enquired Viveka pa, Driver, worker.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X