వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ 125 కోట్ల వ్య‌వ‌హార‌మే కార‌ణ‌మా : సిట్ అదుపులో ప‌ర‌మేశ్వ‌ర్ : వివేకా హ‌త్య కేసులో కొత్త కోణాలు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

వివేకా హ‌త్య కేసులో కొత్త కోణాలు..! | Oneindia Telugu

వైయస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ హ‌త్య వెనుక రూ. 125 కోట్ల సెటిల్మెంట్ వ్యవహారంలో వచ్చిన వివాదమే కారణమని సిట్ అధికారులు భావిస్తున్నారు. హత్య కేసులో దర్యాఫ్తును ముమ్మరం చేసిన అధికారులు, మొత్తం వ్యవహారమంతా ఎర్ర గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిల చుట్టూనే ఉందని భావిస్తున్నారు. వారు నోరువిప్పితే మొత్తం బయటకు వస్తుందని చెబుతున్నారు.

ముందుగానే రెక్కీ..
వివేకానంద రెడ్డి హత్యకు రెండు వారాల ముందే రెక్కీ జరిగిందని, బెంగళూరులోని ఓ భూ వివాదంలో వివేకా, గంగిరెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయని అనుమానిస్తున్నారు. ఈ డీల్ కు సంబంధించి రూ. 1.50 కోట్ల లావాదేవీలపై సిట్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. డీల్ లో తాము నష్టపోకూడదన్న ఉద్దేశంతో గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి చేతులు కలిపారని, వి వేకా హత్యకు నాలుగు రోజుల ముందు పెంపుడు కుక్కను హత్య చేసిన విష‌యం ఇప్ప‌టికే వెలుగు లోకి వ‌చ్చింది.

వివేకా హ‌త్య : ఎలాంటి వారో జ‌గ‌న్ కు తెలుసు : అవినాశ్ విచార‌ణ‌:స‌ంబంధం లేదు: ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి..వివేకా హ‌త్య : ఎలాంటి వారో జ‌గ‌న్ కు తెలుసు : అవినాశ్ విచార‌ణ‌:స‌ంబంధం లేదు: ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి..

SIT taken Parameshwar reddy in to custody : concentrated on land disputes..

వివేకా హత్య తరువాత గంగిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, గత నాలుగు రోజులుగా రహస్య ప్రాంతంలో విచారణ జరుపుతున్నారు. తాజాగా తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరమేశ్వర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి తమ వెంట తీసుకువెళ్లిన సిట్ అధికారులు..ప్ర‌స్తుతం విచార‌ణ సాగిస్తున్నారు.

క్ర‌య‌..విక్రయాలే కార‌ణ‌మా..
వేముల మండలం దుగ్గన్నగారిపల్లెకు చెందిన ఓ వ్కక్తికి వివేకానందరెడ్డి పేరిట ఉన్న ఆస్తుల పవర్‌ ఆఫ్‌ అటార్ణీ ఉన్న ట్లు పోలీసు విచారణలో గుర్తించారు. ఆ వ్యక్తే ఆయనకు సంబంధించిన ఆస్తులు క్రయవిక్రయాలు ఇప్పటి వరకు జరు పుతున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన క్రయవిక్రయాల పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోం ది. కాగా వైఎస్‌ వివేకానందరెడ్డి మృతితో ఆయన పేరిట ఇచ్చిన పవర్‌ ఆఫ్‌ అటార్ణీ ప్రస్తుతం రద్దు అయినట్లే. దీనితో పోలీసులు విభిన్న కోణాల్లో ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆర్థిక లావాదేవీలు, భూముల వ్యవహారాలు, క్రయవిక్రయాలపై ఆరాతీస్తున్నారు. వాటి ఆ ధారంగా ఈ హత్యోదంతం జరిగి ఉంటుందా అన్న కోణంలో ఈ విచారణ చేస్తున్నారు. నెల క్రితం వేంపల్లె సబ్‌రిజిష్ర్టార్‌ కార్యాలయంలో వివేకా పేరిట ఉన్న వేముల మండలంలోని ఆస్తి విక్రయం జరిగినట్లు తెలుసుకున్న పోలీసులు వేంపల్లె సబ్‌రిజిష్ర్టార్‌ కార్యాలయంలో విచారణ నిర్వహించారు.

English summary
YS Viveka murder case investigation is going on. SIT suspecting Parameswar reddy and Gangi reddy role in this murder. One land dispute may cause for this murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X