వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొల్లు వద్దు: బిజెపికి శివాజీ, గొంతు చించుకున్న శీలం, 'పవన్ కళ్యాణ్ ఏంటో!'

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి, ఇప్పటి వరకు హామీ నెరవేర్చుకోని భారతీయ జనతా పార్టీ ఆంధ్రా ద్రోహుల పార్టీ అని నటుడు శివాజీ మంగళవారం మండిపడ్డారు. హోదా కోసం చేస్తున్న బందులో పాల్గొనని వారు ద్రోహులే అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. ఇది ఎవరో వేసే భిక్ష కాదని, ఆంధ్రుల హక్కు అన్నారు. నటుడు శివాజీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కారణాలు వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. ఆ లేఖను ఆయన మీడియాకు చూపించారు.

విభజన బిల్లులో ప్రత్యేక హోదా అంశం చేర్చలేదని కేంద్రమంత్రులు చెబుతున్నారని, అలాంటి సొల్లు చెప్పవద్దని శివాజీ మండిపడ్డారు. సొల్లు మాని ఏపీకి న్యాయం చేయాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదన్న భావనతో యువత ఆందోళన చెందుతోందన్నారు. యువతను ఆందోళనకు గురి చేసే ప్రకటనలు మాని, ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రధాని మోడీపై ఒత్తిడి తేవాలన్నారు.

Sivaji blames BJP for special status to AP

ప్రజల్లోకి రా: కారెం శివాజీ

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా కాకుండా ప్రజల్లోకి వచ్చి పోరాడాలని మాల మహానాడు నేత కారెం శివాజీ అన్నారు. ప్రత్యేక హోదా కోసం బిజెపికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ పోరాడాలని సూచించారు. ఆ సమయం వచ్చిందన్నారు. పవన్ ఉద్దేశ్యం తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారని అన్నారు. ఆయన కాకినాడలో మాట్లాడారు.

నాటి ప్రధాని హామీకి విలువలేదా: జెడీ శీలం

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీకి విలువ లేదా అని ఎంపీ, కాంగ్రెస్ నేత జెడి శీలం పార్లమెంటులో మంగళవారం నాడు గట్టిగా నిలదీశారు. ఆయన గొంతు చించుకొని మరీ మాట్లాడారు.

ప్రత్యేక హోదాను ప్రకటించే విషయమై ప్రధాని మోడీ తక్షణం స్పందించాలన్నారు. హోదా కోసం ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని, అయినా కేంద్రం కళ్లు తెరవలేదన్నారు. పాత ప్రభుత్వం సభలో ఇచ్చిన హామీలకు గౌరవం ఇవ్వరా అని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా, రాష్ట్రాభివృద్ధికి నిధులు తదితర అన్ని విషయాల్లో కేంద్రం సహకరిస్తుందా లేదా చెప్పాలన్నారు. గత ప్రభుత్వపు హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత బిజెపి ప్రభుత్వంపై ఉందన్నారు. పార్లమెంట్ మొత్తం కలిసి తీసుకున్న నిర్ణయాలకే విలువ లేకుంటే ప్రజాస్వామ్యంపై నమ్మకాలు తొలగినట్లేనన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా పైన మేం మాట్లాడాక ఈ ప్రబుధ్దులు వచ్చి ధర్నా చేస్తున్నారని జగన్ పైన మండిపడ్డారు. ఇన్నాళ్లు జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కుతంత్ర రాజకీయాలు మాని అందరం కలిసి తెలుగు ప్రజల తరఫున పోరాడి మన హక్కును సాధించుకుందామన్నారు. మునికోటి మృతి బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. పోరాటం ద్వారా హక్కులనుధించుకుందామని, బలిదానాలు వద్దన్నారు. జగన్ ఇప్పుడు మాట్లాడటంలో ఆశ్చర్యం లేదని, ఇన్నాళ్లు ఆయన ఎక్కడున్నారని ప్రశ్నించారు. జగన్ గేమ్ ఆడుతున్నారని, వైసిపిని సమర్థిస్తున్న ఎస్సీ, ఎస్టీ,
మైనార్టీలు ఆ విషయం తెలుసుకోవాలన్నారు.

English summary
Actor Sivaji on Tuesday lashed out at BJP for not giving special status to AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X