వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకు బీజేపీ కుట్ర, ప్రభుత్వాన్ని తోసేయాలనే: శివాజీ సంచలనం, ప్రధానిగానే ఉండాలని..

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రస్తుతం కొందరు నేతలకు కుర్చీపై మమకారం పెరిగిపోయిందని, బతికినన్ని రోజులు ప్రధానమంత్రిగా ఉండాలని నేతలు ఆలోచించడం దేశానికి తీవ్ర నష్టమని నటుడు, ప్రత్యేక హోదా, విభజన హక్కుల సాధన సమితి వ్యవస్థాపకులు శివాజీ అన్నారు.

చూసుకుందాం రా! ముసలోడ్ని పట్టుకోలేక: రోజా ఆగ్రహం, టీడీపీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలుచూసుకుందాం రా! ముసలోడ్ని పట్టుకోలేక: రోజా ఆగ్రహం, టీడీపీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు

ప్రత్యేక హోదా కోసం ఈ నెల 10వ తేదీ రాత్రి ఏడు గంటల నుంచి 11వ తేదీ ఉదయం 7 గంటల వరకు జాగారణ చేయనున్నట్లు ఆయన చెప్పారు. దేశంలో కులాల మధ్య చిచ్చుపెట్టి అంతర్గత కలహాలు రేపేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సంచలన ఆరోపణ చేశారు.

 తిరుమలను కాపాడుకుంటాం

తిరుమలను కాపాడుకుంటాం

ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం తాను చేసే పోరాటానికి అందరూ మద్దతివ్వాలని నటుడు శివాజీ విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం అంశాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. అయిదు కోట్ల మంది ఏపీ ప్రజలు తిరుమలను కాపాడుకుంటారని చెప్పారు.

నిన్నటి అమరావతి, నేడు తిరుమల

నిన్నటి అమరావతి, నేడు తిరుమల

ఐవైఆర్ కృష్ణా రావు వంటి వారు నిన్నటి దాకా రాజధాని అమరావతిపై పడ్డారని, ఇప్పుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై పడ్డారని శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని తోసేయాలన్న ఆలోచన కొందరిలో ఉందని మండిపడ్డారు.

ఐవైఆర్ వెనుక ఉండవల్లి

ఐవైఆర్ వెనుక ఉండవల్లి

మాజీ చీఫ్ సెక్రటరీ అయిన ఐవైఆర్ కృష్ణారావు హాయిగా రిటైర్మెంట్ జీవితం అనుభవించకుండా పనికి రాని పనులు చేస్తున్నారని శివాజీ మండిపడ్డారు. పనికిమాలిన పుస్తకాలు రాశారని విమర్శించారు. ఐవైఆర్‌కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మద్దతు ఉందని చెప్పారు. ఏపీ ప్రజల కష్టాలు, రాష్ట్ర ప్రయోజనాలు వీరికి పట్టడం లేదన్నారు. వాటి కోసం వీరు పోరాడటటం లేదన్నారు.

దండం పెడతా, జోలికి రావొద్దు

దండం పెడతా, జోలికి రావొద్దు

అసలు ఐవైఆర్ కృష్ణారావు సమస్య ఏమిటని శివాజీ ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారిగా అన్నీ అనుభవించారని, ఇప్పుడు హాటిగా ఇంట్లో కూర్చొని రిటైర్మెంట్ జీవితాన్ని అనుభవించవచ్చు కదా అని సూచించారు. ఇప్పుడున్న ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చి ఏదో ఒక పదవి ఇవ్వాలనేదే మీ ఆలోచనా అని నిలదీశారు. మీకు దండం పెడుతున్నానని, అమరావతి, వెంకటేశ్వర స్వామిల జోలికి రావొద్దన్నారు.

English summary
Actor Sivaji takes on Centre and IYR Krishna Rao over Special Status issue on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X