వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్! చివరకు చేసిందేంటి?, శ్రీరెడ్డి ఓ మచ్చ, భ్రష్టుపట్టిస్తున్నారు: శివప్రసాద్, మోడీపైనా

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ram Gopal Varma Again Questions To Pawan Kalyan

చిత్తూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ల తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఎదురుదాడికి దిగుతున్నారు. శుక్రవారం చిత్తూరు రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో టీడీపీ ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ.. పవన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.

పవన్ చివరకు చేసిందేమీ లేదు..

పవన్ చివరకు చేసిందేమీ లేదు..

జనసేన నాయకుడు రాష్ట్రం కోసం ఏదేదో చేస్తానని చెప్పి చివరకు ఏమీ చేయలేక పోయాడని చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి వివిధ రాజకీయ పార్టీలు పట్టుబట్టినప్పుడు తాను ఢిల్లీకి వస్తానని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయిస్తానని పవన్‌ కల్యాణ్‌ చెప్పారని, చివరికి ఆయన వచ్చిందీ లేదు, ఒత్తిడి చేసిందీ లేదని ఎద్దేవా చేశారు.

పవన్ వ్యాఖ్యలతో టీడీపీ అప్రమత్తం: అతిపెద్ద కుంట్రంటూ నేతలకు జాగ్రత్తలు, అందుకేనా? పవన్ వ్యాఖ్యలతో టీడీపీ అప్రమత్తం: అతిపెద్ద కుంట్రంటూ నేతలకు జాగ్రత్తలు, అందుకేనా?

పవన్ ఆంతర్యమెంటో..?

పవన్ ఆంతర్యమెంటో..?

ఎందుకో ఉన్నట్లుండి పవన్ మౌనం వైపు మొగ్గు చూపడం, బీజేపీని ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం వెనుక ఆంత్యర్యమేంటో అర్థం కావడం లేదన్నారు. మెడీ చేసిన పాపంతో జన్మదిన్నాన్ని ఆనందంగా జరుకోవాల్సిన చంద్రబాబు దీక్ష చేయడం బాధాకరమని శివప్రసాద్ అన్నారు.

నాపై బాబు, లోకేష్‌ల రూ.10కోట్ల కుట్ర, చనిపోవడమే మంచిది: పవన్ సంచలనం, మీడియాపైనా.. నాపై బాబు, లోకేష్‌ల రూ.10కోట్ల కుట్ర, చనిపోవడమే మంచిది: పవన్ సంచలనం, మీడియాపైనా..

మోడీ మారతారనే..

మోడీ మారతారనే..

రాష్ట్రం కోసం ఆయన చేస్తున్న పోరాటానికి తామంతా అండగా ఉంటామని ఎంపీ స్పష్టం చేశారు. ఎంత మొండివారైనా ఏదో ఒక సందర్భంలో మారక తప్పదని, మోడీ కూడా మారుతారన్న నమ్మకం ఉందని చెప్పారు. ప్రత్యేక హోదాతో పాటు, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి నిధులు ఇచ్చి తీరాల్సిందేనని తేల్చి చెప్పారు.

మచ్చతెచ్చిన శ్రీరెడ్డి

మచ్చతెచ్చిన శ్రీరెడ్డి

నటి శ్రీరెడ్డి నిర్వాకంతో తెలుగు చిత్ర పరిశ్రమకు మచ్చ వచ్చిందని, ఆమె చెబుతున్న చీకటి వ్యవహారాలు 1940 దశకం నుంచే ఉన్నాయని, ఇద్దరి పరస్పర సహకారంతో జరిగే రహస్య కార్యక్రమాలను బహిరంగ పరచడం సరికాదని శివప్రసాద్‌ అన్నారు.

భ్రష్టుపట్టించేందుకే..

భ్రష్టుపట్టించేందుకే..

చిత్ర పరిశ్రమలో ఎవరికైనా అన్యాయం జరిగితే చెప్పుకోవడానికి సంఘాలున్నాయని, వాటిపై నమ్మకం లేకుంటే న్యాయబద్ధంగా పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఏవరో ఏదో చెప్పి, దానిపై ప్రముఖ నటులు స్పందించలేదని నిందలు వేయడం సరికాదని హితవు పలికారు. చిత్ర పరిశ్రమను భ్రష్ఠు పట్టించేందుకు కొందరు చేస్తున్న కుట్రగా ఉందని శివప్రసాద్ అన్నారు.

English summary
Telugudesam Party MP Sivaprasad on Friday takes on at Janasena Party president Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X