చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భీమవరంలో డ్రగ్స్ దందా... ఆరుగురి అరెస్ట్... నెదర్లాండ్ నుంచి ఆర్డర్స్...

|
Google Oneindia TeluguNews

ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో డ్రగ్స్ కలకలం రేగిన సంగతి తెలిసిందే. నెదర్లాండ్ నుంచి డార్క్ వెబ్ సైట్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసిన భానుచందర్ అనే యువకుడిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా ఇదే కేసుతో సంబంధం ఉన్న మరో ఐదుగురిని భీమవరం వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. భానుచందర్ బయటపెట్టిన వివరాల ఆధారంగానే వీరిని అరెస్ట్ చేశారు.

అతనిచ్చిన వివరాలతో...

అతనిచ్చిన వివరాలతో...


భానుచందర్‌ను అరెస్ట్ చేసి విచారించిన కస్టమ్స్ అధికారులు కీలక వివరాలు రాబట్టారు. భీమవరంకు చెందిన వెంకట సాయిరాం అనే యువకుడి ద్వారా డ్రగ్స్ సప్లై జరుగుతున్నట్టు గుర్తించారు. కస్టమ్స్ అధికారులు భీమవరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సాయిరాంను వారు అదుపులోకి తీసుకున్నారు. అతనిచ్చిన వివరాలతో డ్రగ్స్ సరఫరాతో లింకులున్న మరో నలుగురు వ్యక్తులను భీమవరం పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మరో ఐదుగురిని ఈ కేసులో అరెస్ట్ చేసినట్టయింది.

ఏడు కిలోల గంజాయి స్వాధీనం...

ఏడు కిలోల గంజాయి స్వాధీనం...

అరెస్టయినవారిలో భానుచందర్ తోడల్లుడు పూర్ణ చందర్ రావు కూడా ఉన్నట్టు సమాచారం. డ్రగ్స్ సప్లైకి అతను కూడా సహకరిస్తున్నట్టు గుర్తించారు. పూర్ణచందర్ రావుతో పాటు అరెస్టయిన మరో ముగ్గురి నుంచి ఏడు కిలోల గంజాయి, 2 మోటార్ సైకిళ్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

ఇలా వెలుగులోకి...

ఇలా వెలుగులోకి...

రెండు రోజుల క్రితం చెన్నై విమానాశ్రయానికి వచ్చిన పార్శిల్స్‌ను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నెదర్లాండ్ నుంచి పశ్చిమ గోదావరిలోని భీమవరంకు వచ్చిన ఓ పార్శిల్‌ను పరిశీలించారు. పార్శిల్ కవర్‌పై టాయ్స్‌కు సంబంధించిన వివరాలు రాసి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన అధికారులు దాన్ని ఓపెన్ చేసి చూశారు. లోపల ఉన్న కిడ్స్ టాయ్స్‌లో 400 డ్రగ్ పిల్స్ ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ రూ.12లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. వెంటనే ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో భీమవరంకు చెందిన భానుచందర్‌ను అరెస్ట్ చేయగా.. అతనిచ్చిన వివరాల ఆధారంగా మరో ఆరుగురు అరెస్టయ్యారు.

English summary
Six men arrested in Bhimavaram,Andhra Pradesh for allegedly supplying drugs to youth. Recently Chennai customs officers arrested a youth for allegedly ordering drugs from Nehtherland.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X