విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్యం మత్తులో వద్దన్నా వినని డ్రైవర్, పర్సుల చోరీ: 5గురు మెడికోల మృతి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

కృష్ణా: జిల్లాలోని గొల్లపూడి సమీపంలోని సూరయ్యపాలెం వద్ద సోమవారం రాత్రి 11.30 గంటలకు ప్రైవేటు బస్సు చెట్టుకు ఢీకొట్టి, బోల్తా పడిన ప్రమాదంలో హైదరాబాద్‌ ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులతోపాటు బస్సు డ్రైవరు దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది మెడికోలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి మద్యం మత్తులో ఉన్న డ్రైవర్, మెడికోల మధ్య స్వల్ప ఘర్షణే కారణంగా తెలుస్తోంది.

మద్యం మత్తులో బస్సు నడపొద్దని అభ్యంతరం చెప్పిన తమతో గొడవపడి డ్రైవర్‌, వేగంగా వెళుతూ బస్సును హఠాత్తుగా ఒక పక్కకు తిప్పి ప్రమాదానికి కారణం అయ్యాడని విద్యార్థులు తెలిపారు.

కాగా, ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థుల బృందం వారం రోజుల క్రితం అమలాపురంలో జరిగిన వైద్య విద్యార్థుల క్రీడా పోటీలకు వచ్చింది. పోటీలు ఆదివారం ముగియడంతో సోమవారం ధనుంజయ్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో విహారయాత్రకు బయల్దేరారు. విజయవాడలోని భవానీద్వీపం, అమరావతి తదితర ప్రాంతాలు తిరిగి, రాత్రి హైదరాబాద్‌ బయలుదేరారు.

విజయవాడ నుంచి బయలుదేరిన కాసేపటికే బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది వైద్య విద్యార్థులు ఉన్నారు. ప్రమాదంలో ఎంబీబీఎస్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న మచ్చా ప్రణయ్‌ రాజారాం(సరూర్‌నగర్), హౌస్‌ సర్జన్లుగా పని చేస్తున్న గిరి లక్ష్మణ్‌(తాండూరు), మూకా విజయ్‌తేజ(కుత్బుల్లాపూర్) సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.

మరో వైద్య విద్యార్థి విజయ్‌కృష్ణ మోహన్‌(రంగారెడ్డి), ఉదయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులు ఇద్దరు హైదరాబాద్, ఒకరు కరీంనగర్, మరొకరు ఆదిలాబాద్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. రాజేశ్, సుచిత అనే ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయ చర్యలు పర్యవేక్షించాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి సీఎం ఆదేశాలు జారీ చేశారు.

అవసరమైతే మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను హైదరాబాద్‌కు తరలించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఆంధ్ర ఆస్పత్రికి వెళ్లిన మంత్రి లక్ష్మారెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాద వివరాలను మంత్రి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన వారి వివరాల కోసం హెల్స్‌లైన్ నెంబర్ 94407 52310 ఏర్పాటు చేశారు.

ఘోర ప్రమాదం

ఘోర ప్రమాదం

కృష్ణా జిల్లాలోని గొల్లపూడి సమీపంలోని సూరయ్యపాలెం వద్ద సోమవారం రాత్రి 11.30 గంటలకు ప్రైవేటు బస్సు చెట్టుకు ఢీకొట్టి, బోల్తా పడిన ప్రమాదంలో హైదరాబాద్‌ ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులతోపాటు బస్సు డ్రైవరు దుర్మరణం పాలయ్యారు.

ఘోర ప్రమాదం

ఘోర ప్రమాదం

మరో 20 మంది మెడికోలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి మద్యం మత్తులో ఉన్న డ్రైవర్, మెడికోల మధ్య స్వల్ప ఘర్షణే కారణంగా తెలుస్తోంది.

ఘోర ప్రమాదం

మరో 20 మంది మెడికోలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి మద్యం మత్తులో ఉన్న డ్రైవర్, మెడికోల మధ్య స్వల్ప ఘర్షణే కారణంగా తెలుస్తోంది.

ఘోర ప్రమాదం

ఘోర ప్రమాదం

మద్యం మత్తులో బస్సు నడపొద్దని అభ్యంతరం చెప్పిన తమతో గొడవపడి డ్రైవర్‌, వేగంగా వెళుతూ బస్సును హఠాత్తుగా ఒక పక్కకు తిప్పి ప్రమాదానికి కారణం అయ్యాడని
విద్యార్థులు తెలిపారు.

ఘోర ప్రమాదం

ఘోర ప్రమాదం

కాగా, ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థుల బృందం వారం రోజుల క్రితం అమలాపురంలో జరిగిన వైద్య విద్యార్థుల క్రీడా పోటీలకు వచ్చింది.

ఘోర ప్రమాదం

ఘోర ప్రమాదం

పోటీలు ఆదివారం ముగియడంతో సోమవారం ధనుంజయ్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో విహారయాత్రకు బయల్దేరారు. విజయవాడలోని భవానీద్వీపం, అమరావతి తదితర ప్రాంతాలు తిరిగి, రాత్రి హైదరాబాద్‌ బయలుదేరారు.

ఘోర ప్రమాదం

ఘోర ప్రమాదం

విజయవాడ నుంచి బయలుదేరిన కాసేపటికే బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది వైద్య విద్యార్థులు ఉన్నారు.

ఘోర ప్రమాదం

ఘోర ప్రమాదం

ప్రమాదంలో ఎంబీబీఎస్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న మచ్చా ప్రణయ్‌ రాజారాం, హౌస్‌ సర్జన్లుగా పని చేస్తున్న గిరి లక్ష్మణ్‌, మూకా విజయ్‌తేజ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.

ఘోర ప్రమాదం

ఘోర ప్రమాదం

మరో వైద్య విద్యార్థి విజయ్‌కృష్ణ మోహన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులు ఇద్దరు హైదరాబాద్, ఒకరు కరీంనగర్, మరొకరు ఆదిలాబాద్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. రాజేశ్, సుచిత అనే ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది.

ఘోర ప్రమాదం

ఘోర ప్రమాదం

గాయపడిన కొందరు విద్యార్థులను పోలీసులు సంఘటనా స్థలంలోనే విచారించారు.

ఘోర ప్రమాదం

ఘోర ప్రమాదం

అనీల్‌ అనే మెడికో తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థులకు, బస్సు డ్రైవర్‌కు ప్రమాదం జరగడానికి కొద్ది సమయం ముందు నుంచే గొడవ జరిగినట్లు తెలిసింది. విద్యార్థులంతా హైదరాబాద్‌ వెళ్లే క్రమంలో సోమవారం ఉదయం మంగళగిరి సమీపంలోని హాయ్‌లాండ్‌ వెళ్లారు.

ఘోర ప్రమాదం

ఘోర ప్రమాదం



అక్కడే బస్సులో బట్టలు, పర్సులు పెట్టి బస్సు క్లీనర్‌ను కాపలా ఉంచి లోపలకు వెళ్లారు. బయటకు వచ్చి చూస్తే 10మంది పర్సులు చోరీకి గురయ్యాయి. క్లీనర్‌ కూడా అక్కడ కనిపించలేదు. దీంతో వారు డ్రైవర్‌తో గొడవకు దిగారు. అనంతరం బస్సును డ్రైవర్‌ హైదరాబాద్‌కు బయల్దేరదీశాడు.

ఘోర ప్రమాదం

ఘోర ప్రమాదం

తర్వాత కూడా విద్యార్థులకు, డ్రైవర్‌కు గొడవ జరిగింది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ అతి వేగంగా బస్సును నడపడమే కాకుండా బస్సు స్టీరింగ్‌ను బలంగా తిప్పడంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టు ఢీ కొని, బోల్తా పడింది.

ఘోర ప్రమాదం

ఘోర ప్రమాదం

బస్సు విజయవాడ నుంచి బయల్దేరడానికి ముందే డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నాడని, మరో డ్రైవర్‌ను పంపించాలని యజమానికి ఫోన్లో చెప్పామని తెలిపారు.

English summary
Five medical students of Osmania Medical College (OMC), Hyderabad, and the bus driver were killed on the spot in a road accident near Vijayawada on Monday midnight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X