తొడగొట్టి చెబుతున్నా ... వచ్చేది టీడీపీ ప్రభుత్వమే .. విజయసాయికి బుద్దా వెంకన్న కౌంటర్
ఏపీలో ఎన్నికలు ముగిశాయి. నేతలు ఎవరి అంచనాలలో వాళ్ళున్నారు. ఇక నేతల మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. వైసీపీ రాజ్య సభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ నాయకులపై , చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ఇక విజయసాయి రెడ్డికి రివర్స్ కౌంటర్ ఇవ్వటానికి టీడీపీ నేతలు సైతం మాటల తూటాలు పేలుస్తున్నారు.
సేమ్ సీన్ రిపీట్ : తేల్చుకోవటానికి సిద్దం: మంత్రి పదవి కొత్త కాదు..సోమిరెడ్డి : సీఈసీకి బాబు లేఖ

తారా స్థాయికి చేరుతున్న టీడీపీ , వైసీపీ మాటల యుద్ధాలు
ఈనెల 23న రాజకీయ నేతల భవిష్యత్ ఏంటో ప్రజా క్షేత్రంలో తేలిపోనుంది . ఇప్పటికే విజయావకాశాలపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఇక కాబోయే సీఎం తామేనని ఎవరికివారు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు . కానీ ఇరు పార్టీల్లో మాటల యుద్ధాలు మాత్రం తారాస్థాయికి చేరుతున్నాయి.

విజయ సాయి నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు చెప్పిన బుద్దా వెంకన్న
వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపి విజయ్ సాయిరెడ్డి వ్యాఖ్యలకు , ట్విట్టర్ పోస్టులకు ప్రతిస్పందిస్తూ, టిడిపి నేత బుద్దా వెంకన్న విజయసాయి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. 'చంద్రబాబు నాయుడికి సమాజంలోని ప్రతి వర్గం నుండి మద్దతు ఉందని ఆయన పేర్కొన్నారు.ముఖ్యంగా మహిళలు చంద్రబాబును ఆదరించారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తొడగొట్టి చెప్తున్నా .. టీడీపీదే అధికారం అన్న బుద్దా వెంకన్న
ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ తిరిగి అధికారంలోకి రావచ్చని టీడీపీ సీనియర్ నాయకుడు బుద్దా వెంకన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీలో టీడీపీ తప్పక అధికారంలోకి వస్తుందని తొడగొట్టి మరీ చెప్పారు. వైసీపీ నేత విజయసాయి రెడ్డి వైసీపీ అధికారంలోకి వస్తుందని పనికిమాలిన ప్రకటనలు చేస్తున్నారని బుద్దా వెంకన్న మండిపడ్డారు .

చంద్రబాబుపై వైసీపీ వ్యాఖ్యలను, ఆరోపణలను ఖండించిన బుద్దా వెంకన్న
చంద్రబాబు నాయుడిపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు బుద్దా వెంకన్న . చంద్రబాబు ఓటమి ఆందోళనలో ఉన్నారని, అందుకే ఈవీఎం లపై ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలను బుద్దా వెంకన్న ఖండించారు.మొత్తానికి తొడగొట్టి మరీ టీడీపీ గెలుస్తుంది అని చెప్పి బుద్దా వెంకన్న రాజకీయ వేడి మరింత పెంచారు.