వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రకాశం జిల్లాలో స్కూల్ సమీపంలో అనకొండ కలకలం, కోళ్లను మింగింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

చీరాల: ప్రకాశం జిల్లాలో కొండ చిలువ కలకలం రేపింది. సకాలంలో దానిని గుర్తించడంతో ముప్పు తప్పింది. జిల్లాలోని ఉమామహేశ్వరపురం పాఠశాల సమీపంలోకి కొండ చిలువ వచ్చింది. దీనిని సోమవారం ఉదయం గుర్తించారు.

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వచ్చిన పిల్లలు కొందరు సమీపంలో కొండ చిలువ ఉండటాన్ని గుర్తించారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు చెప్పారు.

వెంటనే అధికారులు, పాములు పట్టే వాళ్లకు సమాచారం అందించారు. వారు వచ్చి కొండ చిలువను బంధించి అడవుల్లోకి వదలనున్నారు.

Small Anaconda found in Prakasam district

సమీపంలో రివర్ ఫారెస్టు ఉండటంతో కొండ చిలువ వచ్చింది. అది అప్పటికే ఓ కోడిని మింగేసింది. మరో కోడిని మింగే ప్రయత్నంలో ఉంది. దీనితో కదలలేకపోయింది.

శంషాబాద్‌ విమానాశ్రయంలో రెండు కిలోల బంగారం స్వాధీనం

హైదరాబాదులోని శంషాబాద్‌ విమానాశ్రయంలో రెండు కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు సోమవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు.

విమానాశ్రయంలో చేపట్టిన తనిఖీల్లో భాగంగా దోహా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద రెండు కిలోల బంగారం బిస్కెట్లను అధికారులు గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

English summary
Small Anaconda found in Prakasam district on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X