వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

20స్మార్ట్ నగరాలు ఇవే: ఏపీలో రెండు, తెలంగాణ నగరాలకు దక్కని చోటు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయబోయే 20 స్మార్ట్‌ సిటీలను గురువారం ప్రకటించింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు మీడియా సమావేశంలో వీటిని వెల్లడించారు. ఈ జాబితాలో ఒరిస్సాలోని భువనేశ్వర్ అగ్రస్థానంలో ఉంది. ఈ జాబితాలోని నగరాల్లో కేంద్ర ప్రభుత్వం మౌళిక సదుపాయాలను కల్పించనుంది.

నీరు, విద్యుత్, సానిటేషన్, సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, పట్టణ చైతన్యం, ప్రజా రవాణా, ఐటి కనెక్టివిటీ, ఈ-గవర్నెన్స్, పౌరుల భాగస్వామ్యం, మొదలగు అంశాలను కేంద్రం ప్రభుత్వం నిధులతో అభివృద్ధిపర్చనుంది.

Smart City: List of 20 cities to be equipped with modern facilities released

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీల ఎంపికలో పారదర్శక విధానం పాటించామన్నారు. ఆకర్షణీయ నగరాల కోసం రూ. 3లక్షల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఆకర్షణీయ నగరాలతో జీవన ప్రమాణాలు మెరుగవుతాయని అన్నారు.

కేంద్రం ప్రకటించిన స్మార్ట్‌ సిటీలు ఇవే:

1. భువనేశ్వర్‌(ఒడిశా), 2. పుణె(మహారాష్ట్ర), 3. జైపూర్(రాజస్థాన్‌), 4. సూరత్‌(గుజరాత్‌), కోచి(కేరళ), 5. జబల్‌పూర్‌(మధ్యప్రదేశ్‌), 6. న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌, 7. విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్‌), 8. కాకినాడ(ఆంధ్రప్రదేశ్‌), 9. షోలాపూర్‌(మహారాష్ట్ర), 10. కోయంబత్తూర్‌(తమిళనాడు).

11. బెళగావి(కర్ణాటక), 12. దావణగెరె(కర్ణాటక), 13. అహ్మదాబాద్‌(గుజరాత్‌), 14. గౌహతి(అస్సోం), 15. చెన్నై(తమిళనాడు), 16, లూథియానా(పంజాబ్‌), 17, భోపాల్‌(మధ్యప్రదేశ్‌), 18. ఉదయ్‌పూర్‌(రాజస్థాన్‌), 19. ఇండోర్‌(మధ్యప్రదేశ్‌), 20. చెన్నై(తమిళనాడు).

English summary
Modi Government on Thursday released list of 20 smart cities. Urban Development Minister M Venkaiah Naidu released the name of the cities and said that top scorer among the list is Bhubneshwar and Orissa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X