చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ వివాదం: గరుడ వారధి పిల్లర్లపై గోవిందుడి తిరునామాలు తొలగింపు: వాటి స్థానంలో.. !

|
Google Oneindia TeluguNews

తిరుపతి: పరమ పవిత్ర పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమలను సందర్శించడానికి దేశ, విదేశాల నుంచీ వేల సంఖ్యలో చేరుకునే భక్తుల సౌకర్యం కోసం తిరుపతిలో నిర్మిస్తోన్న గరుడ వారధి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మరోసారి వివాదాస్పదం అయ్యాయి. గరుడ వారధి పిల్లర్లపై ఇదివరకు రూపొందించిన గోవిందుడి తిరు నామాలను తొలగించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే వాటిని తొలగించినట్లు తెలుస్తోంది.

చంద్రబాబుపై దాడికి నిరసనగా టీడీపీ భారీ యాక్షన్ ప్లాన్: అమరావతి గ్రామాలు సహా..!చంద్రబాబుపై దాడికి నిరసనగా టీడీపీ భారీ యాక్షన్ ప్లాన్: అమరావతి గ్రామాలు సహా..!

తిరునామాల స్థానంలో స్మార్ట్‌సిటీ లోగో..

తిరునామాల స్థానంలో స్మార్ట్‌సిటీ లోగో..

గోవిందుడి తిరునామాల స్థానంలో కొత్తగా స్మార్ట్‌సిటీ లోగోలను డిజైన్ చేశారు. స్మార్ట్‌సిటీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోంది. స్మార్ట్‌సిటీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 65 ఏ ప్రాజెక్టుకైనా 63 శాతం నిధులను కేటాయిస్తుంది. మిగిలిన 35 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. స్మార్ట్‌సిటీ పథకం కింద గరుడ వారధి ఫ్లైఓవర్ రూపుదిద్దుకుంటున్నందున.. ఆ పథకానికి సంబంధించిన లోగోను డిజైన్ చేయాలంటూ కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సూచించినట్లు తెలుస్తోంది. ఈ లోగోలో కూడా తక్కువ పరిమాణంలో గోవిందుడి నామాలను డిజైన్ చేశారు. తిరుపతి స్మార్ట్‌సిటీ అనే అక్షరాలను ముద్రించారు.

తిరునామాల డిజైన్ ఆగమ శాస్త్రానికి విరుద్ధమనే వాదన కూడా..

తిరునామాల డిజైన్ ఆగమ శాస్త్రానికి విరుద్ధమనే వాదన కూడా..

గరుడ వారధి పిల్లర్లపై గోవిందుడి తిరునామాలను డిజైన్ చేయడం ఆగమ శాస్త్రానికి విరుద్ధమనే వాదన కూడా వినిపిస్తోంది. పవిత్రమైన తిరునామాలను ఇష్టానుసారంగా, ఎక్కడపడితే అక్కడ వినియోగించకూడదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రోజూ వేలాదిమంది ప్రజలు, వాహనాలు రాకపోకలు సాగించే ప్రదేశంలో తిరునామాలను డిజైన్ ఉంచడం వల్ల అది అపవిత్రమౌతుందంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమశాస్త్ర సలహాదారులు అభ్యంతరం వ్యక్తం చేశారని అంటున్నారు.

 ఆరు కిలోమీటర్లు.. 684 కోట్ల రూపాయలు..

ఆరు కిలోమీటర్లు.. 684 కోట్ల రూపాయలు..

ఈ ఎలివేటెడ్ కారిడార్‌ పొడవు ఆరు కిలోమీటర్లు. దీని నిర్మాణానికి అయ్యే ఖ‌ర్చు 684 కోట్ల రూపాయ‌లు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయినందు వల్ల ఇందులో కేంద్ర‌ప్ర‌భుత్వ వాటా 65 శాతం ఉంటుంది. మ‌రో 35 శాతం నిధుల‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం భ‌రిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటాను కూడా తిరుమల తిరుపతి దేవస్థానమే భరించడానికి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.

తిరుపతిలో తొలి భారీ ఫ్లైఓవర్

తిరుపతిలో తొలి భారీ ఫ్లైఓవర్

తిరుచానూరు స‌మీపంలోని మ్యాంగోమార్కెట్ వ‌ద్ద ఎలివేటెడ్ కారిడార్ వంతెన ఆరంభమౌతుంది. లక్ష్మీపురం స‌ర్కిల్‌, రామానుజుల వారి స‌ర్కిల్, శ్రీనివాసం, లీలామహల్‌ సెంటర్‌ మీదుగా వెళ్తుంది. నంది సర్కిల్‌ వద్ద ఈ వంతెన ముగుస్తుంది. అక్క‌డి నుంచి ఎలాంటి వాహ‌నాల రాక‌పోక‌ల‌కు సంబంధించిన ఇబ్బందులు లేకుండా అలిపిరి టోల్‌గేట్ వ‌ర‌కూ వెళ్ల‌వ‌చ్చు. దీని పొడవు ఆరు కిలోమీటర్లు. ఇంత భారీ ఫ్లైఓవర్ రూపుదిద్దుకోవడం తిరుపతిలో ఇదే తొలిసారి.

English summary
Smart City logo was contain on Garuda Varadhi pillars instead of Govinda Naamaalu. Previously first pillar of under construction Garuda Varadhi eleveted express corridor designed as Sreevaari Naamalu in Tirupati Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X