వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు నచ్చనివారే, కృష్ణంరాజు ఓ కోవర్టు: శోభానాగిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sobha Nagi Reddy
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే వద్దనుకుంటున్నారో వారే బయటకు పోతున్నారని, జగన్ పిలిస్తే తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కూడా ఖాళీ అవుతాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు శోభా నాగి రెడ్డి, బాలరాజు, ప్రసాద రాజులు శనివారం అన్నారు. భారతీయ జనతా పార్టీలో చేరిన రఘురామ కృష్ణం రాజు ఓ కోవర్టు అని వారు మండిపడ్డారు.

రాష్ట్రంలో జగన్ హవా కొనసాగుతోందన్నారు. ఇడుపులపాయలో శనివారం వైయస్సార్ కాంగ్రెసు కేంద్ర పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వారు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జగన్ పార్టీ ఖాళీ అయిపోతుందంటూ మీడియాలో వస్తున్న కథనాలను కొట్టివేశారు. మీడియాను అడ్డు పెట్టుకొని నీచ రాజకీయాలు చేయడం సరికాదన్నారు.

రాజకీయంగా జగన్‌ను ఎదుర్కొనలేక కాంగ్రెస్, టిడిపి అసత్యప్రచారాలకు దిగాయన్నారు. జగన్‌కు నచ్చనివారే పార్టీ నుంచి బయటకు వెళ్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ మాట్లాడుతూ తెలంగాణాలో ముస్లింలంతా సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటున్నారన్నారు. ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు, కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాకుండా కిరణ్ ఎంతో జాగ్రత్త పడ్డారన్నారు.

పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు మాట్లాడుతూ రఘురామ కృష్ణం రాజుని కాంగ్రెస్, టిడిపి, బిజెపి కోవర్టుగా అభివర్ణించారు. ఆయన విధానాలు నచ్చకే జగన్ ఆయన్ను పార్టీ నుంచి బయటకు పంపించారన్నారు.

English summary
YSR Congress Party MLAs on Saturday said Raghurama Krishnam Raju was a covert of BJP, Congress and Telugudesam Parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X