వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారే మీ కాళ్ల వద్దకు: శోభా, వేగం తగ్గింది: పురంధేశ్వరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Purandeswari - Sobha Nagireddy
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టిస్తే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ అధిష్టానమే మన కాళ్ల వద్దకు వస్తుందని, అది చేయకుండా వీళ్లే వాళ్ల కాళ్ల వద్దకు వెళ్తున్నారని, తెలుగు జాతి గౌరవాన్ని తాకట్టుపెడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగి రెడ్డి బుధవారం నిప్పులు చెరిగారు.

రాష్ట్ర విభజనను నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్‌లో తమ పార్టీ ప్రజాప్రతినిధులు ధర్నా నిర్వహిస్తారని తెలిపారు. తెలుగు తల్లి విగ్రహం నుంచి అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వరకూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు పాదయాత్ర చేసి, అనంతరం ధర్నా చేస్తామన్నారు. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేయాలని, విభజనకు అనుకూలంగా టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో ఈ ఆందోళన చేస్తున్నట్టు చెప్పారు.

చంద్రబాబు, సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే సోనియా, ఆంటోనీ కమిటీ రెండూ మనకాళ్ల దగ్గరికి వస్తాయని, వీళ్లందరూ ఢిల్లీకి వెళ్లి ఏమీచెయ్యక్కర్లేదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన దృష్టి పెట్టడం మాని ఆరు కోట్ల ప్రజల గురించి ఆలోచించి ఉంటే చంద్రబాబు వెంట ప్రజలు ఉండేవారని, ఆయన చర్యల వల్ల వచ్చే ఎన్నికల్లోనూ ప్రతిపక్షనేతగానే ఉండక తప్పదన్నారు.

తమ పార్టీని అశోక్ బాబు శంకించాల్సిన అవసరం లేదని, ఎపిఎన్‌జీవోలు సమ్మెకు దిగకముందే తాము రాజీనామాలు సమర్పించామన్నారు. మీసాలు తిప్పడం తమ నైజం కాద ని, పదవులు వదులుకొని ప్రజల వైపు నిలబడ్డామని మంత్రి టిజి వెంకటేష్‌ను ఉద్దేశించి అన్నారు.

మా వల్లే వేగం తగ్గింది: పురంధేశ్వరి

విభజన జరుగుతుందంటే పదవులకు రాజీనామాలు చేయడానికి వెనుకాడేది లేదని కేంద్ర సహాయ మంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి విశాఖలో అన్నారు. పదవుల్లో ఉండి సమైక్యాంధ్రకు అనుకూలంగా కృషి చేయడం వల్లనే విభజన ప్రక్రియ వేగం మందగించిందని, ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటామని, ఆంటోని కమిటీకి సమైక్యవాదాన్ని సమర్థంగా వినిపిస్తున్నామన్నారు.

English summary

 YSR Congress Party MLA Sobha Nagi Reddy on Wednesday announced dharna by YSRC MLAs on September 20 in support of United AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X