వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కోసమే, వారొద్దంటే మీరే కలుస్తామంటారా?: శోభా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sobha Nagi Reddy
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసేందుకే విభజన కుట్రకు అధికార కాంగ్రెసు పార్టీ తెరలేపిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆళ్లగడ్డ శాసన సభ్యురాలు శోభా నాగి రెడ్డి సోమవారం ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రజలకు సెంటిమెంట్స్ ఉండవా అని ప్రశ్నించారు. సీమ ఉనికిని పోగొట్టేందుకే రాయల తెలంగాణ అంటున్నారన్నారు. రాయల తెలంగాణను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు ఒకే తాటి పైకి రావాలన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించారని, అలాంటి వ్యక్తి విభజనకు సహకరించడం దారుణమన్నారు. బాబు పాలనలో ప్రాజెక్టులు పూర్తయితే తీర్పు బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పు ఇలా వచ్చేది కాదన్నారు. మన ఐక్యత వల్లనే ట్రైబ్యునల్ తీర్పులో నష్టం జరిగిందన్నారు.

రాయల తెలంగాణను అడ్డుకునేందుకు అన్ని పార్టీలకు చెందిన సీమ నేతలు నడుం కట్టాలన్నారు. సమైక్యాంధ్రలో సీమ ప్రాంతానికే అన్యాయం జరిగిందని, ఇప్పుడు విభజన ద్వారా శాశ్వతంగా నష్టపోతుందన్నారు. రాయల తెలంగాణకు తెలంగాణ నేతలు నో చెబుతుంటే కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలే అన్యాయం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు ఒక్కో నినాదంతో ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

స్వార్థంతోనే రాయల తెలంగాణ: ఈటెల

కొందరు సీమాంధ్ర ప్రాంత నేతలు స్వార్థంతోనే రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారని తెరాస శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ కరీంనగర్‌లో అన్నారు. రాయల టికి ఇరు ప్రాంత ప్రజలు ఒప్పుకోరన్నారు.

English summary
YSR Congress Party Allagadda MLA Sobha Nagi Reddy on Monday said they are opposing Rayala Telangana proposal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X