వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలోనూ కాదు: చంద్ర‌బాబు వెళ్లిన ప్ర‌తీ చోటా ఓట‌మే: ఏ ఒక్క‌రూ గెల‌వ‌లేదు..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ఎన్నిక‌ల్లో ఘోరంగా ప‌రాజ‌యం చెందిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్క‌డే కాదు..ఆయ‌న వెళ్లిన ప్రతీ చోట ఆయ‌న ఎవ‌రికైతే ప్ర‌చారం చేసారో వారంతా ప‌రాజం పాల‌య్యారు. ఏపీలో ఒక ర‌కంగా చంద్ర‌బాబు నేల విడిచి సాము చేసారు. జ‌గ‌న్ త‌న ప్ర‌త్య‌ర్ధి చంద్ర‌బాబు అని ప్ర‌చారం చేస్తే..చంద్ర‌బాబు మాత్రం మోదీ..కేసీఆర్ ల‌క్ష్యంగా ప్ర‌చారం చేసారు. అది బెడిసి కొట్టింది. ఇక‌, బీజేపీయ‌త‌ర పార్టీల గెలుపు కోసం ప్ర‌చారం చేసారు. ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లోని అభ్య‌ర్దులు ఓడిపోయారు. ఇప్పుడు ఇది సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది..

ఏపీలోనే కాదు..ఎక్క‌డైనా ఇదే ఫ‌లితం..
ఏపీలో ఘోర ప‌రాజ‌యం పాలైన టీడీపీ అధినేత పైన ఇప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా సెటైర్లు పేలుతున్నాయి. ఏపీలో టీడీపీకి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం కోసం మాజీ ప్ర‌ధాని దేవ‌గౌడ‌, ఫ‌రూక్ అబ్దుల్లా, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌, బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ వంటి వారు వ‌చ్చారు. వారు ప్ర‌చారం చేసిన ప్రాంతాల్లో ఎక్క‌డా విజ‌య‌వాడ ఎంపీ మిన‌హా మ‌రెక్క‌డా టీడీపీ గెల‌వ‌లేదు. క‌డ‌ప‌-క‌ర్నూలు- నంద్యాలలో ఫ‌రూక్ అబ్డుల్లాతో క‌లిసి ప్ర‌చారం చేసారు. కానీ, ఫ‌లితాలు వ్యతిరేకంగానే వ‌చ్చాయి. కాంగ్రెస్‌తో మిత్ర‌ప‌క్షంగా ఉన్న‌ప్ప‌టికీ..కాంగ్రెస్ అగ్ర నేత‌లెవ్వ‌రూ టీడీపీతో క‌లిసి ప్ర‌చారం చేయ‌లేదు. ఇక‌, ఏపీలో ఎన్నిక‌లు పూర్త‌యిన త‌రువాత చంద్ర‌బాబు అనేక ప్రాంతాల్లో బీజేపీయ‌త‌ర ప‌క్షాల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేసారు. అక్క‌డ అదే ఫ‌లితం.

Social media satires on TDP Chief Chandra Babu over his election campaign and results

సోష‌ల్ మీడియాలో సెటైర్లు..
బీజేపీ అభ్య‌ర్దుల‌ను ఓడించాల‌ని పిలుపునిస్తూ చంద్ర‌బాబు అనేక ప్రాంతాల్లో ప్ర‌చారం చేసారు. క‌ర్నాట‌క‌లోని మాండ్య‌లో సుమ‌ల‌త‌కు వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు ప్ర‌చారం చేసారు. త‌న ప్ర‌చారం కార‌ణంగా సుమ‌ల‌త ఓడటం ఖాయ‌మ‌ని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ, సుమ‌ల‌త విజ‌యం సాధించారు. ఇక‌..సోష‌ల్ మీడియాలో సాగుతున్న ప్ర‌చారం చూస్తే..చంద్ర‌బాబు ప‌వ‌ర్ ఎక్క‌డ త‌గ్గిందంటూ సెటైర్లు మొద‌లు పెట్టారు. ఎవరండీ.. చంద్రబాబు పవర్ తగ్గిందని అన్నది. ఆయన సోనియా ఇంటికెళ్లారు.. కాంగ్రెస్ ఖేల్‌ ఖతమైంది. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు.. ఆమ్‌ఆద్మీ పార్టీ చిత్తయిపోయింది. ఆయన బెంగాల్ వెళ్లారు.. దీదీ దిగాలు పడింది. ఆయన బెంగళూరు వెళ్లారు.. కుమారస్వామి చిత్తయ్యారు. ఆయన యూపీ వెళ్లారు.. మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌ అడ్రస్ గల్లంతైంది. ఆయన అశోక్‌ గహ్లోత్‌తో తిరిగారు.. రాజస్తాన్‌లో సింగిల్ సీటు కూడా రాలేదు. ఆయన దేవగౌడతో భేటీ అయ్యారు.. ఫస్ట్ టైం ఓడిపోయారు. బాబు లెగ్ పవర్ అలాంటిది. పవర్‌ లేకున్నా లెగ్‌పవర్‌ తగ్గేది లేదు. తగ్గాల్సింది మనమే తమ్ముళ్లూ' అంటూ సోషల్‌ మీడియా వేదికగా జోకులు పేల్చుతున్నాయి.

English summary
Social media satires on TDP Chief Chandra Babu over politics. Where Chandra Babu campaigned against BJP in that areas did not get positive results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X