హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోసం చేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Software company owner arrested
హైదరాబాద్: ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంఘటనలో సాఫ్ట్‌వేర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పోలీసులకు చిక్కాడు. అతనితో పాటు మరో వ్యక్తిని హైదరాబాదులోని పంజాగుట్ట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

చెన్నైకి చెందిన శాంతన్ కృష్ణన్ (38) కొద్దికాలం క్రితం నగరానికి వచ్చాడు. ఇక్కడే నెల్లూరుకు చెందిన లలిత అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి గత సంవత్సరం మే నెలలో సోమాజిగూడ శ్రీ మల్లి టవర్స్‌లో డెస్ట్రీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ పేరుతో సంస్థను ప్రారంభించారు.

శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగాలిప్పిస్తామని ప్రకటనలు గుప్పించారు. దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీ, యువకులు ఉద్యోగాల కోసం సంస్థ కార్యాలయానికి వచ్చారు. వారిని ఇంటర్య్వూ చేసి వారి తాహతును బట్టి 40 వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేశారు. శిక్షణతో పాటు నెలకు 10 వేల రూపాయలు జీతంగా ఇస్తామని వారికి నమ్మబలికారు.

రెండు, మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి జీతాలు చెల్లించారు. తరువాత జీతాలు ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ ఎండీ శాంతన్ కృష్ణన్, హెచ్ఆర్ మేనేజర్ ఉదయ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

English summary

 Software Company MD Shanthan Krishnan from Tamil Nadu has been nabbed by Punjagutta police in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X