సమస్యలు: జగన్‌తో ఇరిగేషన్ ఇంజినీర్ల భేటీ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ ఇంజినీర్లు సోమవారం భేటీ అయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన వారు తమ సమస్యలను తెలియజేశారు.
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు పోస్టింగులు ఇవ్వకుండా తమ జీవితాలతో ఆడుకుంటున్నాయని ఇంజినీర్లు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. మూడు నెలలుగా తమకు జీతాలు కూడా ఇవ్వడం లేదని వారు వాపోయారు.

తమకు ఏ రాష్ట్రంలో పోస్టింగ్ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇంజినీర్లు తెలిపారు. తమ సమస్యను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో సాయం చేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డిని ఇంజినీర్లు కోరారు.
జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం ఇంజినీర్లు మీడియాతో మాట్లాడుతూ.. తమ సమస్యలపై జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. తమ సమస్యను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని చెప్పారు.












Click it and Unblock the Notifications