India
  • search
  • Live TV
శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ కొత్త మంత్రులు - కొత్త వివాదాలు : ప్రతిపక్షాలకు అస్త్రంగా - ఎన్నికల టీం ఇదేనా..!!

|
Google Oneindia TeluguNews

ఏపీలో కొత్త కేబినెట్ కొలువు తీరి ఇంకా వారం కూడా పూర్తి కాలేదు. కొత్త కేబినెట్ లో 11 మంది మాజీ మంత్రులు.. 14 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్ ఈ టీంను ఎంపిక చేసారు. అయితే, వీరిలో పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినా..మంత్రులు బాధ్యతల స్వీకరణ చేయలేదు. కానీ, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి తొలి సారి జిల్లాలకు..పర్యటనలకు వెళ్లిన కొందరు మంత్రులను వివాదాలను చుట్టు ముడుతున్నాయి. అందులో సీనియర్లు సైతం ఉన్నారు.

మంత్రులు -అభిమానులు -వివాదాలు

మంత్రులు -అభిమానులు -వివాదాలు

మరోసారి మంత్రిగా అవకాశం దక్కించుకున్న విశ్వరూప్ తన సొంత నియోజకవర్గం అమలాపురం వెళ్లగానే అక్కడి అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. డబ్బులు విసిరివేటయం.. బైక్ విన్యాసాలు వివాదానికి కారణమయ్యాయి. అదే విధంగా.. మరో సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు బాధ్యతలు చేపట్టిన తరువాత సొంత జిల్లా శ్రీకాకుళం వెళ్లారు.

అక్కడ సైతం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి స్వాగతం పలికారు. మంత్రికి కరచాలనం చేస్తూ..చాలా సేపు తన చేతిని విడవకపోవటంతో ఆగ్రహించిన మంత్రి ధర్మాన ఆయన పైన చేయి చేసుకున్నారు. కార్యకర్త పైన మంత్రి చేయి చేసుకోవటం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక, జగన్ కేబినెట్ లో అనూహ్యంగా కాపు కోటాలో మంత్రి పదవితో పాటుగా డిప్యూటీ సీఎం హోదా దక్కించుకున్న కొట్టు సత్యనారాయణకు తొలి పర్యటనలోనే నిరసన ఎదురైంది. శ్రీ‌కాళ‌హ‌స్తీశ్వ‌రుని ద‌ర్శించుకు నేందుకు వెళ్లిన సమయంలో సామాన్య భక్తులు నిరీక్షించాల్సి వచ్చింది.

దేవాలయంలోనూ తప్పని నిరసనలు

దేవాలయంలోనూ తప్పని నిరసనలు

దీంతో మంత్రికి వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేసారు. ఆ తరువాత మంత్రి జోక్యం చేసుకొని వారిని దర్శనాకికి పంపాలంటూ అధికారుకు సూచించారు. భక్తులు మంత్రిని నిలదీయటంతో ఆయన షాక్ అయ్యారు. అనంతపురం జిల్లా నుంచి తొలి సారి ఎమ్మెల్యే పదవితోనే మంత్రిగా ప్రమోషన్ దక్కించుకున్న ఉషశ్రీ చరణ్ తన సొంత నియోజకవర్గం కళ్యాణదుర్గంకు వెళ్లారు. అక్కడ స్వాగతం పలికే క్రమంలో ఒక చిన్నారిని ఆస్పత్రికి తీసుకోళ్లే సమయంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని..ఆ తరువాత పాప మరణించటంతో రాజకీయంగా విమర్శలకు కారణమైంది.

అయితే, దీని పైన జిల్లా పోలీసు అధికారులు వివరణ ఇచ్చారు. పాప ఆస్పత్రికి వెళ్లే సమయంలో ఎవరూ అడ్డుకోలేదని స్పష్టత ఇచ్చారు. కానీ, ప్రతిపక్షాలు మాత్రం దీని పైన పెద్ద ఎత్తున విమర్శలు చేసాయి.ప్రభుత్వానికి - ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించిన సమాచార- ప్రసార శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ సీఎం పైన తన భక్తి చాటుకొనేందుకు చేసిన వ్యాఖ్యలు విమర్శలకు కారణమైంది.

మంత్రుల వ్యాఖ్యలు..ప్రతిపక్షాలకు అస్త్రాలు

మంత్రుల వ్యాఖ్యలు..ప్రతిపక్షాలకు అస్త్రాలు

సీఎం ఆశీస్సులు దక్కాలంటే ఆరాధించాలే కానీ..ఆరా తీయకూడదంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇక, నెల్లూరు జిల్లా నుంచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రి హోదాలో ఈ రోజు సొంత జిల్లాకు వెళ్తున్నారు. అయితే, నెల్లూరు కోర్టులో మంత్రి కేసుకు సంబంధించిన ఆధారాల చోరీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది.

దీని పైన టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. విచారణకు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. 2024 ఎన్నికల టీంగా చెప్పుకుంటున్న ఈ టీం..ప్రతిపక్షాలను ఢిఫెన్స్ పడేసే విధంగా వ్యవహరిస్తూ..సమర్ధవంతంగా వ్యవహరించాల్సిన సమయంలో..వారు ఆత్మరక్షణలో పడుతూ..వివర్శలకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. ఇదే ఇప్పుడు అధికార వైసీపీలో హాట్ టాపిక్ గా మారుతోంది.

English summary
Some of the new Ministers in AP Cabinet attitude creating controversies, with this Opposition parties taking advantage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X