పవన్ కళ్యాణ్‌ను తప్పుదారి పట్టిస్తున్నారా?, ఆ విమర్శలను చూస్తాం.. టిడిపి
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా తప్పుదారి పట్టిస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు బీజేపీ నేతలు. బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు శుక్రవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్‌ను ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా పైన పవన్ కళ్యాణ్ బీజేపీని, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడును నిన్న (గురువారం) అనంతపురం బహిరంగ సభలో తూర్పారబట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విష్ణుకుమార్ పైవిధంగా స్పందించారు.
నల్ల ధనం, అవినీతి విషయంలో కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నామని చెప్పారు. ఉద్యోగులకు జీతాలు పెంచినా, అవినీతిని మాత్రం అరికట్టలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నల్లధనాన్ని బయటకు తీసుకురావడం అనేది మంచి పని అని, రాజకీయ ప్రక్షాళన జరగాలని, బలహీనంగా ఉన్నవారిపైనే చట్టం చాలా బలంగా పని చేస్తోందని, బలవంతులపై చట్టం బలహీనంగా పని చేస్తోందని, అన్యాయాన్ని ప్రశ్నించడానికే జనసేన పార్టీ స్థాపించానని పవన్ చెప్పిన విషయం తెలిసిందే.
మాకు శత్రువు కాదు: కేఈ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమకు శత్రువు కాదని తెలుగుదేశం పార్టీ నేత, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వేరుగా చెప్పారు. పవన్ కళ్యాణ్ చేసిన సద్విమర్శలను, సూచనలను సమీక్షించుకుంటామని చెప్పారు. అదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీయే మేలు అని చెప్పారు.












Click it and Unblock the Notifications