వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘జగన్ కలలో వైయస్ కనిపించి రాష్ట్రపతిగా వెంకయ్య పేరును చెప్పారట-మోడీ మెచ్చుకోలు’

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తమ వెబ్‌సైట్ ప్రచురితం కాని ఓ కథనాన్ని ప్రచురితమైనట్లు ప్రచారం చేయడం పట్ల సాక్షి దినపత్రిక తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తమ వెబ్‌సైట్ ప్రచురితం కాని ఓ కథనాన్ని ప్రచురితమైనట్లు ప్రచారం చేయడం పట్ల సాక్షి దినపత్రిక తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సాక్షి పత్రికకు అనుబంధంగా నడుస్తున్న సాక్షి వెబ్‌సైట్ పేజీలను మార్ఫింగ్ చేసి, ఫొటోషాప్ సాయంతో మార్చి తమ పాఠకులను తప్పుదారని పట్టిస్తున్నారని మండిపడింది.

తప్పుడు కథనం వైరల్ చేశారు..

తప్పుడు కథనం వైరల్ చేశారు..

తమ వెబ్‌సైట్లో ప్రచురితం అయినట్లు తప్పుడు కథనాలను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచురితం చేస్తున్నారని ఆరోపించింది. ‘వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతిగా ప్రతిపాదించింది నేనే: జగన్' అన్న శీర్షికన సాక్షి వెబ్‌సైట్లో ఓ కథనం వచ్చిందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయింది.

తమకు సంబంధం లేదు..

తమకు సంబంధం లేదు..

అయితే, ఈ కథనం తమ వెబ్‌సైట్లో రాలేదని, ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఈ మేరకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఈ కథనంతో తమకు సంబంధం లేదని స్పస్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారమైన కథనంలో వైయస్సార్ తన కలలో కనిపించి రాష్ట్రానికి వెంకయ్యనాయుడు చేస్తున్న సేవలను ప్రస్తావించి, ఆయనకు కృతజ్ఞతగా ఏదైనా చేయాలని కోరారని జగన్ చెప్పినట్లు ఉంది.

Recommended Video

Chandrababu Fixed YS Jagan And Pawan Kalyan For 2019 Polls
రెండో కథనాలు.. మోడీ మెచ్చుకున్నట్లు..

రెండో కథనాలు.. మోడీ మెచ్చుకున్నట్లు..

ఆపై జగన్‌కు ఉపరాష్ట్రపతి ఆలోచన వచ్చి, అమిత్ షాకు చెప్పినట్లు జగన్ పేర్కొన్నట్లు ఉండటం గమనార్హం. వెంకయ్య పేరును చెప్పిన తర్వాత.. మోడీ పొగుడుతూ.. చిన్న వయస్సులోనే గొప్ప ఆలోచనలు ఉన్న నీవు స్వాతి ముత్యం అని తనను పొగిడారని జగన్ చెప్పినట్లు ఆ కథనంలో ఉంది. మరో కథనంలో జగన్ దయ వల్లే వెంకయ్య అని సాక్షి వెబ్ సైట్లో వచ్చినట్లు మరో తప్పుడు కథనం కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

కేటీఆర్, లోకేష్‌లపైనా..

కేటీఆర్, లోకేష్‌లపైనా..

ఇది ఇలా ఉండగా, తెలంగాణ, ఏపీ ఐటీ మంత్రులు కేటీఆర్, నారా లోకేష్‌లపైనా ఇలాంటి తప్పుడు కథనాలనే ప్రచురితం చేయడం గమనార్హం. ఎవరో కొందరు నెటిజన్లు కావాలని ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచురితం చేస్తున్నట్లు తెలుస్తోంది. వెంకయ్యనాయుడును రాష్ట్రపతిగా ప్రతిపాదించింది తామేనని చెప్పినట్లుగా నారా లోకేష్‌పై కథనం ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్లో, కేటీఆర్‌ది నమస్తే తెలంగాణ వెబ్‌సైట్లో వచ్చినట్లుగా తప్పుడు కథనాలను ప్రచారం చేశారు.

English summary
It is said that some people are misguiding sakshi readers dont believe that fake news.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X