వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబోయ్ ట్రావెల్స్ బస్సా!? ప్రజల ప్రాణాలతో చెలగాటం .. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ డ్రైవర్లు

|
Google Oneindia TeluguNews

కృష్ణా : ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. బస్సు ఫిట్‌గా ఉంచడంలో నిర్లక్ష్యం .. నిపుణలైన డ్రైవర్లు లేకుండా నడిపిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారు. ఈ అంశాలు ఇలా ఉంటే మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ కొందరు బస్సు డ్రైవర్లు ఫూటుగా మందు తాగి .. బస్సు నడుపుతున్నారు. ఆర్టీఏ తనిఖీల్లో బయటపడ్డ ఈ ఉదంతం ఆందోళన కలిగిస్తోంది.

డ్రైవర్ బుజ్జికి 10 రోజుల జైలు

డ్రైవర్ బుజ్జికి 10 రోజుల జైలు

ఏపీలో రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ తనిఖీ ముమ్మరం చేశారు. అయితే డ్రైవర్లు మందు తాగి ఉండటం చూసి షాకవడం వారి వంతైంది. కంచికచర్ల వద్ద డంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. అయితే తనిఖీల్లో పలువురు ప్రైవేట్ డ్రైవర్లు పట్టుబడటం కలకలం రేపుతోంది. వీరిలో పద్మావతి, జీవీఆర్, కనకదుర్గ ట్రావెల్స్ డ్రైవర్లు ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేశారు. పద్మావతి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ బుజ్జికి నందిగామ కోర్టు శిక్ష ఖరారు చేసింది. తాగి బస్సు నడిపినందుకు 10 రోజుల జైలుశిక్ష విధించింది. అంతేకాదు అతని లైసెన్స్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

మరో డ్రైవర్ అరెస్ట్

మరో డ్రైవర్ అరెస్ట్


మరోవైపు చెన్నై కోల్ కతా జాతీయ రహదారిపై కూడా ఆర్టీఏ అధికారు దాడులు నిర్వహించారు. పొట్టిపాడు టోల్ గేట్ వద్ద ప్రైవేట్ బస్సులను రవాణశాఖ అధికారులు తనిఖీ చేశారు. మద్యం సేవించి వాహనాన్ని నడుపుతున్న వరుణ్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. తాగి పట్టుబడ్డ డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు చెప్తున్నారు. బుజ్జికి పడినట్టు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

ప్రశ్నార్థకంగా భద్రత

ప్రశ్నార్థకంగా భద్రత

ఆర్టీసీ బస్సుల్లో సీట్లు దొరకగా, రైళ్లలో రిజర్వేషన్ బెర్త్ లభించక .. ప్రైవేట్ ట్రావెల్స్ ను ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారు. అయితే సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకమవుతుంది. దీనిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని అన్నిపక్షాల నుంచి డిమాండ్ వస్తోంది.

English summary
Private travels Neglecting to keep the bus fitness .. scared without a skilled driver. These are some of the private travels on the other side, but some bus drivers are drunk and run the bus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X