వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టు తీర్పు సీఎం జగన్‌కు చెంపపెట్టు : సోమిరెడ్డి

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత మినహాయింపుపై సీబీఐ ఇచ్చిన తీర్పు ఆయనకు చెంపపెట్టు లాంటిదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ తీర్పు వల్ల రాజ్యంగపరంగ అత్యున్నత స్థానంలో ఉన్న వారికైనా, సామాన్యులకైన చట్టాలు ఒకేలా పనిచేస్తాయనే విషయాన్ని మరోసారి రుజువు అయిందని అన్నారు. ఇక కోర్టు తీర్పుతో ప్రజలు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరుతున్నారని చెప్పారు.

అయితే రాజీనామాపై నిర్ణయం తీసుకోవడం ముఖ్యమంత్రి జగన్ నైతికతకే వదిలివేస్తున్నామని చెప్పారు. గతంలో నీలం సంజీవరెడ్డి లాంటీ వాళ్లు నైతిక విలువలకు కట్టుబడి రాజీనామాలు చేశారని గుర్తు చేశారు. ఈ సంధర్భంగా ప్రజలు కోరుకుంటున్నట్టుగా కోర్టు తీర్పు ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు.

 Somireddy ChandramohanReddy welcomed CBI court verdict of jagan case

కాగా జగన్ వ్యక్తిగత మినాహయింపుకు సంబంధించి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన గన్నవరం నుండి హైదరాబాద్ రావడానికి 60 లక్షల రుపాయాలు అవుతాయని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రవాణా కోసం కనీసం పది లక్షల రూపాయలు కూడ కావని తెలిపారు. కాగా ఇది జగన్ వ్యక్తిగత కేసు అని, ప్రభుత్వానికి ఎలాంటీ సంబంధం లేదని అన్నారు. మరోవైపు సీబీఐ కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని యనమల రామక్రిష్ణుడు అన్నారు.

కాగా అక్రమ ఆస్తుల కేసులో వ్యక్తిగత హజరునుండి మినహాయింపును కోరుతూ సీఎం జగన్‌మోహన్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. రాజ్యంగబద్దమైన పదవిలో ఉండడం వల్ల రాలేకపోతున్నట్టు జగన్ తన పిటిషన్‌లో పేర్కోన్నారు. ఈనేపథ్యలంనే తనకు కోర్టు ముందు హజరయ్యోందుకు మినహాయినింపు ఇవ్వాలని కోరారు. అయితే ఆయన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని సీబీఐ తరపున లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పిటిషన్‌పై ఈనెల 18న వాదనలు విన్న సీబీఐ కోర్టు నేడు ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది.

English summary
CBI court verdict on the personal Appearance exemption in the Disproportionate Assets case of AP CM JaganMohan Reddy welcomed the TDP leader Somireddy ChandramohanReddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X