హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెటి‌ఆర్‌ను గుంటూర్లో చదివించావేం?: సోమిరెడ్డి కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Somireddy Chandramohan Reddy
హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతంలో మేథావులే లేరంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన తనయుడు సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావును గుంటూరులో ఎలా చదివించారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం ప్రశ్నించారు.

తెలంగాణ ప్రాంత నేతలు హైదరాబాద్ సిర్ఫ్ హమారా అని చెబుతున్నట్లుగా తాము కూడా చెబుతున్నామన్నారు. హైదరాబాద్ తమదే అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకు వచ్చేందుకు కెసిఆర్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఎంతమంది కెసిఆర్‌లు, కె కేశవ రావులు వచ్చినా హైదరాబాదులో ఉన్న సీమాంధ్రులను ఏం చేయలేరన్నారు. కెసిఆర్‌కు ఏమాత్రం సంస్కారం లేదని మండిపడ్డారు. తెరాస, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితిలు నెల రోజులు కుస్తీ పట్టినా నిజాం కళాశాల మైదానం నిండలేదని ఎద్దేవా చేశారు.

కర్నూలులో జరిగిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభ కోసం సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు లక్షల మంది తరలి వచ్చారని చెప్పారు.

English summary
Telugudesam Party senior leader and Former Minister 
 
 Somireddy Chandramohan Reddy on Monday questioned 
 
 TRS chief KCR why his son KT Rama Rao studied in 
 
 Guntur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X