అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్: 'ఏపీలో భారీ అవినీతి, విదేశీ బ్యాంకులు అప్పులివ్వడం లేదు'

|
Google Oneindia TeluguNews

అమరావతి: చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు శుక్రవారం మరోసారి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి, టీడీపీ నేతలు కేంద్రంపై దాడి చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.

నేనొస్తున్నా!: రంగంలోకి రామ్ మాధవ్, బాబుకు చెక్ పెట్టేనా? నేరుగా అధికారంలోకి రాకున్నా...నేనొస్తున్నా!: రంగంలోకి రామ్ మాధవ్, బాబుకు చెక్ పెట్టేనా? నేరుగా అధికారంలోకి రాకున్నా...

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 80 యంత్రాలు పని చేయడం లేదన్నారు. ఈ యంత్రాలు మెయింటెనెన్స్ బాధ్యతలు టీబీఎస్ సంస్థకు కాంట్రాక్టుగా ఇచ్చారని, మొబిలైజేషన్ ద్వారా 103 కోట్లు, బిల్లుల రూపంలో రూ.45 కోట్లు ఇచ్చారన్నారు.

Somu Veerraju says big corruption in Andhra Pradesh

ఆ యంత్రాలు పని చేయకపోయినప్పటికీ సీఎం డ్యాష్ బోర్డులో పని చేస్తున్నట్లుగా చూపిస్తోందన్నారు. టీబీఎస్ సంస్థ కాంట్రాక్టును తక్షణమే రద్దు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో రాష్ట్రంలో భయంకరమైన అవినీతి జరుగుతోందన్నారు.

టాయిలెట్స్ నిర్మాణం, ఎస్ఆర్జీఎస్‌లో జరుగుతున్న అన్యాయం, అవినీతిని తాము బయటపెడతామని చెప్పారు. రాష్ట్రంలోని అవినీతిని చూసి విదేశీ సంస్థలు, ముఖ్యంగా విదేశీ
బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Bharatiya Janata Party MLC Somu Veerraju on friday said that big corruption in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X