రాజధానిపై అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ మడమ తిప్పారు: సోము వీర్రాజు విమర్శలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిపై స్పందించిన తీరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మాటలపై అసెంబ్లీ సాక్షిగా మడమ తిప్పారని విమర్శించారు.

అసెంబ్లీలో అలాంటి పదాలు వాడి వికేంద్రీకరణ పాటా?: సోము వీర్రాజు
అమరావతి రాజధానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ కట్టుబడి ఉందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. పార్లమెంట్, న్యాయ స్థానాలు వంటి పదాలు అసెంబ్లీలో వినియోగించి వికేంద్రీకరణ పాట పాడటం దారుణమన్నారు. కర్నూలులో హైకోర్టు బీజేపీ కోరుకుంది అంటే అది రాజధాని కాదని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసి చూపించారని సోము వీర్రాజు అన్నారు.

అమరావతి రాజధానిగానే కేంద్రం వేలకోట్ల అభివృద్ధి పనులు: సోము
అమరావతి రాజధాని కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. ఈ వాస్తవాన్ని ముఖ్యమంత్రి జగన్ గ్రహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయగలమని చెప్పారు. మీరు బ్లాక్ పేపర్ విడుదల చేయగలరంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు సోము వీర్రాజు. మద్యం విషయంలోనూ ఏపీ సర్కారుపై సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటం వల్లే నాటుసారా.. గ్రామాల వరకూ వస్తుందన్నారు. దీంతో నాటుసారా మరణాలు పెరుగుతున్నాయని మండిపడ్డారు.

మద్యంతో ఏపీ ప్రజల సొమ్ము దోపిడీ అవుతోంది: సోము వీర్రాజు
రాష్ట్ర
ప్రభుత్వం
ఒక
మద్యం
ధరలతో
ఏపీలో
రాష్ట్ర
ప్రజల
సొమ్మును
దోపిడీ
చేస్తూ..
మరోవైపు
ప్రజల
ఆరోగ్యంతో
చెలగాటడం
ఆడుతోందని
విమర్శించారు
సోము
వీర్రాజు.
రాష్ట్రంలో
ప్రభుత్వం
అమ్ముతున్న
మద్యం
డబ్బులు
దారిమళ్లుతున్నాయని
ఆరోపించారు.
రాష్ట్రంలో
ఎంత
మద్యం
విడుదల
అవుతోంది..
ఎంత
అమ్మకాలు
జరుగుతున్నాయో
దర్యాప్తు
చేయాలని
డిమాండ్
చేశారు.
రాష్ట్రంలో
మద్యం
దుకాణాలకు
ఏయో
వాహనాలు
వస్తున్నాయో..
డబ్బులు
ఎవరు
వసూలు
చేస్తున్నారో
నిఘా
పెట్టాలని
మీడియా
ప్రతినిధులను,
రిపోర్టర్లను
కోరారు
సోము
వీర్రాజు.
మద్యం
అమ్మకాల్లో
డబ్బులు
కొంత
శాతమే
ప్రభుత్వం
చేతికి
వస్తుందని
ఆరోపించారు.
మిగితా
అంతా
కూడా
ప్రైవేటు
వ్యక్తుల
చేతుల్లోకి
వెళ్తుందని
మండిపడ్డారు.
దీని
వెనక
ప్రభుత్వ
పెద్దల
హస్తం
ఉందని,
దీనిపై
సమగ్ర
విచారణ
జరిపించాలని
సోము
వీర్రాజు
డిమాండ్
చేశారు.