వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటింటికి మద్యం , బిర్యానీ, ఎక్సైజ్ శాఖలో అవినీతి: ఎమ్మెల్సీ వీర్రాజు

తెలుగుదేశం ప్రభుత్వంపై ఏపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి నిప్పులు చెరిగారు. దేశవ్యాప్యంగా మద్యపానాన్ని నిషేధించాలనేది మహత్మాగాంధీ కోరికని, గాంధీ కలలకు టిడిపి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వంపై ఏపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి నిప్పులు చెరిగారు. దేశవ్యాప్యంగా మద్యపానాన్ని నిషేధించాలనేది మహత్మాగాంధీ కోరికని, గాంధీ కలలకు టిడిపి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు.

రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మద్యం, బిర్యానీ సరఫరా అవుతున్నాయన్నారు. మద్యానికి వ్యతిరేకంగా మహిళలు అందోళనకు దిగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ఎక్సైజ్ శాఖలో అంతులేని అవినీతి జరుగుతోందన్నారు.

Somu veerraju slams on Tdp governament

ఈ అవినీతిని అరికట్లడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. మద్యం పేరుతో జనాలను దోచుకుతింటున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎక్సైజ్ శాఖలో చోటుచేసుకొన్న అవినీతిపై ముఖ్యమంత్రికి లేఖ రాసినట్టు చెప్పారు. మద్యంపై వచ్చే ఆదాయంతో రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలని అనుకోవడం దారుణమన్నారు.

Recommended Video

రూ.330 కోట్లతో మొక్కలను నాటారని, మూడు రోజులకే మొక్కలు చచ్చిపోయాయని ఆయన మండిపడ్డారు. మద్యం, పెట్రోల్ ను కొన్ని దేశాలు జిఎస్టీ నుండి మినహయించాయన్నారు. అందుకే మనం కూడ మినహయించాలని సోము వీర్రాజు కోరారు. రాజకీయపార్టీల విరాళాల ప్రక్రియను ప్రక్షాళన చేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

ఎన్ డి ఏ రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ పర్యటనను కొందరు రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయ న విమర్శించారు. పాదాబివందనం పేరుతో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారనన్నారు. పెద్దలకు పాదాబివందనం చేయడం మన సంస్కృతిలో భాగమన్నారు. అయితే దీన్ని రాజకీయం చేయడం సరైంది కాదన్నారు.

English summary
Bjp Mlc Somu Veerraju made allegations on Tdp government on Thursday.there is corruption in Exise department he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X