వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోదా ఇస్తాం! కానీ, అవినీతి బాబును నమ్మేదెలా?: సోము ఆవేదన, ‘ఎమర్జెన్సీ కంటే దారుణం’

|
Google Oneindia TeluguNews

Recommended Video

టీడీపీ అంటే తెలుగు 'డ్రామా' పార్టీ, అవినీతిని తవ్వడానికి బుల్డోజర్ కావాలి

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ద్వారా వచ్చే నిధులను లెక్క కడితే 16వేల కోట్లు అని తేలిందని, ఆ నిధులను కేంద్రం ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

అయితే, ఏపీలో జరుగుతున్న అవినీతితో ప్రభుత్వాన్ని కేంద్రం నమ్మలేకపోతోందని అన్నారు. అందుకే ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నామని సోము వీర్రాజు చెప్పారు. శనివారం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ లోటు 22వేల కోట్లుంటే.. ఇప్పటికే రూ.4వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని సోము వీర్రాజు తెలిపారు. ఈ విషయాన్ని మాత్రం టీడీపీ ప్రభుత్వం చెప్పడం లేదని అన్నారు.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదననెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

హోదా ఇస్తాం.. కానీ..

హోదా ఇస్తాం.. కానీ..

అరుణ్‌ జైట్లీ సూచించినట్లు ‘స్పెషల్‌ స్టేటస్‌ వెహికల్‌' ఏర్పాటు చేస్తే.. హోదా హామీ ద్వారా ఏపీకి దక్కాల్సిన అన్నిటికి అన్ని మేళ్లూ అందుతాయని, ఈ విషయంలో బీజేపీపై ఎలాంటి అనుమానాలు అవసరంలేదని వీర్రాజు స్పష్టం చేశారు. అయితే అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు మాత్రం అందుకు సుముఖంగా లేరని, తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆయన రాష్ట్రాన్ని బలిపెడుతున్నారని ఆరోపించారు.

కేసీఆర్ అంతంటే.. బాబు ఇంతంటారా?

కేసీఆర్ అంతంటే.. బాబు ఇంతంటారా?

తెలంగాణ సీఎం కేసీఆర్ తమ సచివాలయం కోసం రూ.150 కోట్లు అని చెబుతుంటే.. మన రాష్ట్రంలో మాత్రం రూ.950 కోట్లు ఎలా అవుతాయని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఎన్ఆర్ఈజీఎస్, సర్వ శిక్షా అభియాన్ నిధులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ లోనూ అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, అసలు వెంగమాంబ ఎవరని ఆయన ప్రశ్నించారు.

ప్రజల సొమ్మంటే పప్పు బెల్లమా?

ప్రజల సొమ్మంటే పప్పు బెల్లమా?

రాష్ట్రంలోని జిల్లా ఆస్పత్రుల్లోనూ భారీ అవినీతి జరుగుతోందని సోము వీర్రాజు ఆరోపించారు. మొక్కలు పెంచడానికి కూడా చంద్రబాబు ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఉద్యోగులను కేటాయించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. శ్రీశైలం, అన్నవరం, దుర్గగుడిలో కూడా వారే మొక్కలు పెంచుతారట అన్నారు. ఆ మొక్కలు ఏవీ అని ప్రశ్నించారు. దేవాలయాల వద్ద మొక్కల పెంపకం దేవాదాయ శాఖ చూసుకుంటుంది కదా? అని ప్రశ్నించారు. ప్రజల సొమ్మంటే ప్రభుత్వానికి పప్పు, బెల్లంలా అయిపోయిందని సోము వీర్రాజు అన్నారు.

ఎమర్జెన్సీ కంటే దారుణం

ఎమర్జెన్సీ కంటే దారుణం

ఎవరైనా అడిగితే మోడీ సొమ్మా? ఉత్తర, దక్షిణ భారతదేశం అంటూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లేదంటే వైసీపీ, జగన్ స్క్రిప్టు, పవన్ కళ్యాణ్ మాట్లాడితే పొద్దున ఉండవల్లి అరుణ్ కుమార్ స్క్రిప్టు అని అని, సాయంత్రం బీజేపీ స్క్రిప్టు అని టీడీపీ పెద్దలు అంటున్నారని ధ్వజమెత్తారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ కంటే కూడా ఏపీలో దారుణ పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఏపీలో జయప్రకాశ్ నారాయణన్ సంపూర్ణ విప్లవం రావాలని అన్నారు. హోదా కోసం రూ. 16వేల కోట్లు అని.. ఇప్పుడది రూ.33వేల కోట్లు అంటున్నారని మండిపడ్డారు. అప్పట్లో ప్యాకేజీ అద్భుతమని బాబే అన్నారని గుర్తు చేశారు.

 అబద్ధాల బాబు

అబద్ధాల బాబు

చంద్రబాబు తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు అన్ని అబద్ధాలు చెబుతున్నారని, అసెంబ్లీలో కూడా ప్రజలు సమస్యలు పట్టించుకోకుండా.. అబద్ధాలే వల్లే వేస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. విష్ణుకుమార్ రాజు మాట్లాడితే ప్రజలకు తమ తప్పులు తెలిసిపోతాయని ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. తమ ఆవేదనంతా 5కోట్ల ఏపీ ప్రజల కోసమేనని అన్నారు. హోదా ఇస్తామన్న చంద్రబాబు సర్కారు తీసుకోవడం లేదని అన్నారు. సీఎస్ఆర్ కింద కట్టిన నిర్మాణాలను కూడా తామే కట్టినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోందని అన్నారు. సర్వశిక్షా అభియాన్ నిధులను కూడా కాజేశారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వాళ్లను బానిసలంటారా? అని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాబుపై సెటైర్లు

బాబుపై సెటైర్లు


హోదా లెక్క రూ.16వేల కోట్లని తేలిందని, కేంద్రం విడుదల చేసిన నిధులపై పూర్తి సమాచారం కావాలంటే.. పవన్ కళ్యాణ్, ఉండవల్లి అరుణ్ కుమార్, జేపీలకు ఇస్తామని చెప్పారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల అవినీతిపై పోరాటం చేస్తామని అన్నారు. అవినీతిపై సీబీఐ విచారణ ఇవ్వమని తమ ఫ్లోర్ లీడర్ అడిగితే.. మంత్రి అవసరం లేదని అన్నారని చెప్పారు. అవినీతి నుంచి ఏపీని కాపాడాలని సోము వీర్రాజు అన్నారు. సర్కారు అవినీతిపై తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని, కావాలంటే ఇస్తానని చెప్పారు. చంద్రబాబు గత పది రోజుల నుంచే కేంద్రంపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాము టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి కూడా విమర్శలు చేస్తున్నామని అన్నారు.

ప్రజాకోర్టులో తేల్చుకుంటాం

ప్రజాకోర్టులో తేల్చుకుంటాం

ఏపీలో జరుగుతున్న అవినీతిపై ప్రజా కోర్టుకు వెళతామని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై తమ వద్ద ఇంకా ఆధారాలున్నాయని, అవన్ని బయటపెడతామని చెప్పారు. అవిశ్వాసంపై చర్చిద్దామని చెప్పినా.. టీడీపీ వాళ్లే చర్చకు రానీయకుండా ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. చాయ్ అమ్ముకునే పేదవాడు ప్రధాని అయితే హిట్లర్‌లా కనిపిస్తున్నారా? అని చంద్రబాబుపై మండిపడ్డారు.

English summary
BJP Somu veerraju on takes on at Andhra Pradesh CM chandrababu Naidu and tdp for corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X