వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రికార్డ్: తండ్రి కొడుకులు ఒకే మంత్రివర్గంలో, కెసిఆర్ తరహలోనే బాబు

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో లోకేష్ కు మంత్రివర్గంలో చోటు దక్కింది. లోకేష్ ఆదివారం నాడు మంత్రిగా ప్రమాణం చేశారు. అయితే తండ్రి కొడుకులు క్యాబినెట్ లో కొనసాగడం రికార్డుగా నిలిచిపోనుంది.

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో లోకేష్ కొత్త రికార్డు సృష్టించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది రోజులకే ఆయన మంత్రిపదవిని చేపట్టారు.

8 ఏళ్ళ క్రితం ఆయన పార్టీ కార్యకలాపాలను తన భుజాల మీద వేసుకొన్నారు.పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తూ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

పార్టీలో అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు. మరో వైపు పార్టీతో పాటు ప్రభుత్వ వ్యవహరాల్లో కూడ లోకేష్ పట్టుపెంచుకొనేందుకుగాను మంత్రిగా బాధ్యతలను కట్టబెట్టారు చంద్రబాబునాయుడు.

తండ్రి కొడుకులు ఒకే మంత్రివర్గంలో రికార్డే

తండ్రి కొడుకులు ఒకే మంత్రివర్గంలో రికార్డే

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకే మంత్రివర్గంలో తండ్రీ కొడుకులు ఉండడం రికార్డేనని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ ఈ తరహ ఘటనలు చోటుచేసుకోలేదని వారు గుర్తు చేస్తున్నారు.చంద్రబాబునాయుడు సుదీర్ఘకాలంపాటు రాజకీయాల్లో కొనసాగుతున్నారు.అయితే ఆయన తనయుడు లోకేష్ రాజకీయాలకు కొత్త. మంత్రులు, అధికారులతో లోకేష్ సమీక్షలు నిర్వహించడంతో వివాదాలకు కారణమైంది.దీంతో లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణలో కెటిఆర్

తెలంగాణలో కెటిఆర్

తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ తన మంత్రివర్గంలో తనయుడు కెటిఆర్ మంత్రివర్గంలో చోటు కల్పించారు. కెటిఆర్ కు తొలుత పంచాయితీరాజ్, ఐటి శాఖలను కట్టబెట్టారు. మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో పంచాయితీరాజ్ శాఖను మరోమంత్రి జూపల్లి కృష్ణారావుకు కేటాయించారు.జిహెచ్ ఎంసి ఎన్నికల బాధ్యతలను కెటిఆర్ తన భుజాన వేసుకొన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత మున్సిఫల్ శాఖను కూడ కెటిఆర్ కు కేటాయించారు కెసిఆర్.

కెటిఆర్ తరహలో దూకుడుగా వ్యవహరించగలుగుతారా?

కెటిఆర్ తరహలో దూకుడుగా వ్యవహరించగలుగుతారా?

లోకేష్ తెలంగాణ మంత్రి కెటిఆర్ తరహలో దూకుడుగా వ్యవహరిస్తారా అనే చర్చ కూడ లేకపోలేదు. పాలన ప్యవహరాల్లో ఆయక పట్టుసాధించేందుకుగాను ఇంకా సమయం తీసుకొనే అవకాశం లేకపోలేదు.ఎమ్మెల్సీగా కూడ లోకేష్ బాధ్యతలు స్వీకరించి వారం రోజులు కూడ కాలేదు. కాని, కెటిఆర్ తెలంగాణ ఉధ్యమ సమయంలోనే ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు.వీటన్నింటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

చినబాబే కేంద్రంగా పాలన?

చినబాబే కేంద్రంగా పాలన?

చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆయన అధికార కేంద్రంగా మారే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు కూడ ఉన్నాయి. తెలంగాణలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.అయితే కెటిఆర్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. కీలక వ్యవహరాలను కెటిఆర్ చక్కబెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పాలనలో లోకేష్ పట్టు సాధించేందుకు ఇంకా సమయం పట్టే అవకాశాలు లేకపోలేదు.అయితే ఇదే తరుణంలో చినబాబు కేంద్రంగా పాలన సాగే అవకాశాలను కొట్టిపారేయలేమని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

English summary
son and father in same cabinet first time in andhra pradesh history.lokesh and chandrababu naidu same cabinet created new record in andhra pradesh state .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X